ఎన్నో సమస్యల నడుమ టీ 20 వరల్డ్ కప్ ను ఒమన్ మరియు యూఏఈ లు వేదికగా మొదలు పెట్టారు. మెయిన్ టోర్నీ కన్నా ముందుగా క్వాలిఫైయర్ మ్యాచ్ లు ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుని ఉంటే పరిస్థితి ఏమైనా మారివుండేదేమో. కానీ ఆశ్చర్యకరంగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది ఒమన్. మొదట బ్యాటింగ్ లో ఎక్కువ పరుగులు చేసి స్కాట్లాండ్ పై ఒత్తిడి పెంచాలనుకుంది. అయితే అద్భుతమైన బౌలింగ్ తో చెలరేగిన స్కాట్లాండ్ ఒమన్ ను 122 పరుగులకే అల్ అవుట్ చేసింది. ఒమన్ బాట్స్మన్ లలో ఇలియాస్ (37) మరియు మక్సూద్ (34) లు మినహా ఎవ్వరూ ఆకట్టుకోలేదు.

స్కాట్లాండ్ బౌలర్లు జోష్ డేవీ, షరీఫ్, లీస్క్ తలా రెండు వికెట్లను దక్కించుకుని ఒమన్ పతనాన్ని శాసించారు. మ్యాచ్ లో ఎక్కడా ఒమన్ జోరు కనిపించలేదుసొంత మైదానంలో చెలరేగి ఆడుతారనుకుని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. న్యూ గినియాతో గెలిచిన మొదటి మ్యాచ్ మినహా రెండు మ్యాచ్ లలోనూ ఒమన్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. అనవసరమైన షాట్ లు ఆది భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీ లో ఆడే అవకాశాన్ని కోల్పోయారని చెప్పాలి. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న స్కాట్లాండ్ కు 123 పరుగుల లక్ష్యం ఏ మాత్రం ఇబ్బంది పెట్టబోదు.

స్కాట్లాండ్ ఈ టోర్నీ లో అద్భుతంగా రాణిస్తోంది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన స్కాట్లాండ్ టీమ్ మొదటి మ్యాచ్ నుండి తన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను తమ అల్ రౌండ్ ప్రతిభతో దెబ్బ కొట్టింది. ఆ తర్వాత న్యూ గినియాను ఒంటి చేత్తో మట్టికరిపించింది. ఇక చివరి మ్యాచ్ లో ఒమన్ సైతం ఓటమి అంచున నిలబడి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే గ్రూప్ బి నుండి సూపర్ 12 కు అర్హత సాధించిన రెండవ టీమ్ గా నిలవనుంది. అంతే కాకుండా మూడు గెలుపులతో గ్రూప్ బి మొ మొదటి స్థానంలో నిలిచి గ్రూప్ 2 లో ఉన్న జట్లతో మెయిన్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ గ్రూప్ లో ఉన్న ఇండియా, పాకిస్తాన్, న్యూజీలాండ్ మరియు ఆఫ్గనిస్తాన్ జట్లకు స్కాట్లాండ్ నుండి సవాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.






మరింత సమాచారం తెలుసుకోండి: