యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాకిస్తాన్ మరియు ఇండియాకు మధ్యన జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్ కు ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ మ్యాచ్ సూపర్ 12 లో నాలుగవ మ్యాచ్ గా రేపు రాత్రి 7.30 నిముషాలకు మొదలు కానుంది. ఇప్పటికే ఒరి జట్లు గెలవడానికి అవసరయిన అన్ని అవకాశాలను చూస్తున్నారు. దాయాదుల మధ్య జరగబోయే ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్ననే సూపర్ 12 అర్హత మ్యాచ్ లు ముగిసిన విషయం తెలిసిందే. గ్రూప్ ఏ నుండి శ్రీలంక నమీబియా మరియు గ్రూప్ బి నుండి స్కాట్లాండ్ బంగ్లాదేశ్ లు సూపర్ 12 కు అర్హత సాధించాయి. ఖచ్చితంగా సూపర్ 12 కు చేరుతుంది అనుకున్న ఐర్లాండ్ కు గట్టి షాక్ తగిలింది.

ఇక ఈ రోజు నుండి సూపర్ 12 మ్యాచ్ లు జరగనున్నాయి. కానీ అందరి దృష్టి రేపటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది.  కాగా ఇప్పుడు బీసీసీఐ భారత్ అభిమానులకు షాక్ ఇచ్చింది. భారత్ టీమ్ తో ఉన్న నలుగురు భారత్ బౌలర్లను ఇండియాకు పంపేసింది.  ఐపిఎల్ పూర్తయిన వెంటనే కొందరు బౌలర్లను నెట్ లో బౌలింగ్ చేయించడానికి ఇక్కడే ఉంచుకున్నారు. వారిలో అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మాన్ మెరివాలా, కరణ్ శర్మ, సాబజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతం మరియు వెంకటేష్ అయ్యర్ ఉన్నారు. ఈ ఎనిమిది మంది నుండి  కరణ్ శర్మ, సాబజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతం మరియు వెంకటేష్ అయ్యర్ లను ఇండియాకు పంపడం జరిగింది. వచ్చే నెల 4 నుండి స్థానిక సయ్యద్ ముస్తక్ అలి టోర్నమెంట్ ప్రారంభం కానుంది ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహించడానికి వీరిని పంపినట్లు బీసీసీఐ తెలిపింది.

మిగిలిన ఇండియన్ ఫేసర్లు మాతృ వరల్డ్ కప్ అయ్యేంత వరకు జట్టుతో ఉండనున్నారు. అయితే ప్రస్తుతం యూఏఈలో ఉన్న భారత బౌలర్ల ద్వారా నెట్ లో సాధన చేస్తే మనకు ఉపయోగపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్లో పిచ్ లపై హార్షల్ పటేల్ బౌలింగ్ ఆడితే ఉపయోగం ఉంటుంది, అలాగే మిగిలిన ఫాస్ట్ బౌలర్ల తో ప్రాక్టీస్ లాభదాయకం. మరి చూద్దాం రేపు జరగబోయే దాయాదుల పోరులో విజయం ఎవరిదో.

మరింత సమాచారం తెలుసుకోండి: