కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్ మరియు వెంకటేష్ అయ్యర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి యుఎఇ నుండి భారతదేశానికి తిరిగి వస్తున్నారు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ మరియు లుక్మాన్ మెరివాలా అక్కడే ఉండాలని బీసీసీఐ అడిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో బాగా రాణించిన యువ ఆటగాళ్లను బీసీసీఐ అక్కడే ఉంచిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ అక్కడ యూఏఈ వేదికగా జరగడంతో అందులో రాణించిన చాలా మంది యువ బౌలర్లను అక్కడే ఉంచింది బీసీసీఐ. కానీ ఇప్పుడు అందులో కొందరికి వెన్నకు పంపిస్తుంది.

టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఎక్కువ నెట్ సెషన్‌లు ఉండవు. ప్రత్యేకించి స్పిన్నర్లందరూ తమ రాష్ట్రాల కోసం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఆడితే వారు ప్రయోజనం పొందుతారని జాతీయ సెలెక్టర్లు భావిస్తున్నారు. వారికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం భావించారు. టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా మెంటార్‌గా నియమితులైన ఎంఎస్ ధోనీ సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.  ఆదివారం జరిగే టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.

గత నెలలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ ) ద్వారా టీ 20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించడానికి ముందు ధోనీ కొత్త పాత్రలో నియమించబడ్డాడు. యూఏఈ లో గత సంవత్సరం వారి చరిత్రలో మొదటిసారి ప్లే-ఆఫ్స్ బెర్త్‌ను కోల్పోయిన తర్వాత వారి 9వ ఫైనల్‌లో 4వ టైటిల్‌ను గెలుచుకోవడంతో అతను ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021లో అద్భుతమైన పునరాగమనాన్ని పూర్తి చేశాడు. సూపర్ 12 దశలకు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌లలో భారత్ ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయాలను నమోదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: