యూఏఈ, ఓమ‌న్ వేదిక‌గా ఐసీసీ ఆధ్వ‌ర్యంలో బీసీసీఐ ఆతిథ్యంలో టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మొన్నటి వ‌ర‌కు సూప‌ర్ 12 లో ఆడే నాలుగు జ‌ట్ల కోసం క్వాలీఫైయ‌ర్ మ్యాచ్ లు జ‌రిగాయి. అందులో బంగ్లాదేశ్, శ్రీ‌లంక‌, స్కాలాండ్ తో పాటు న‌మీబియా సూప‌ర్ 12 కు అర్హ‌త సాధించాయి. అయితే నేటి నుంచి సూప‌ర్ 12 లో మ్యాచ్ లు జ‌రుగుతున్నాయి. టీమిండియా సూప‌ర్ 12 గ్రూప్ 2 లో ఉంది. అయితే ఇందులో ఉన్న మిగితా 5 జ‌ట్ల తో మ్యాచ్ లు ఆడ‌నుంది. అందులో భాగంగా ఈ నెల 24 న దాయాది దేశం అయిన పాక్ తో టీమిండియా త‌ల ప‌డ‌నుంది.



అయితే పాక్ తో మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు చాలా  రోజుల నుంచి ఎదురు చుస్తున్నారు. అయితే మ్యాచ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో మన హైదరాబాద్ లో మ్యాచ్ చూడ‌టానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని గృహ స‌ముదాయాలు తో పాటు ర‌ద్దీ గా ఉన్న ప్ర‌దేశ‌ల‌లో పెద్ద పెద్ద స్క్రీన్ లు పెట్టి మ్యాచ్ కోసం సిద్దం చేస్తున్నారు. అలాగే హైద‌రాబాద్ లో ఉన్న మ‌ల్టీ ప్లేక్స్ ల‌లో మ్యాచ్ రోజు ప్ర‌త్యేక క్రికెట్ మ్యాచ్ షో ల‌ను వేస్తున్నారు. అందుకు టికెట్ల సైతం పెడుతున్నారు. అలాగే న‌గ‌రంలో ఉన్న కొన్ని బార్లు, రెస్టారెంటు లలో కూడా భారీ గా స్క్రీన్ లు ఏర్నాటు చేస్తున్నారు. అలాగే జూబ్లి హీల్స్, ఫీల్మ్ న‌గ‌ర్ లో ఉన్న కొన్ని క్ల‌బ్ ల‌లో కూడా మ్యాచ్ కోసం ప్రత్యేకంగా తెర‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కొన్ని ప‌బ్ ల నిర్వ‌హ‌కులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్స‌టీ లో కూడా విద్యార్థి సంఘాల ఆధ్వ‌ర్యంలో పెద్ద పెద్ద స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం మ‌న హైద‌రాబాద్ లో పండుగ వాత‌వ‌ర‌ణంల మ్యాచ్ ఏర్పాట్ల సాగుతున్నాయి. అయితే ఇండియా పాక్ మ్యాచ్ 24 న సాయ‌త్రం 7:30 గంట‌ల నుంచి ప్ర‌త్యేక్ష ప్రసారం కానుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: