ఈ నెల 17 వ తేదీ నుండి ప్రపంచ కప్ లో భాగంగా క్వాలిఫైయర్ మ్యాచ్ లు మొదలయిన సంగతి తెలిసిందే. నిన్నటితో ఈ మ్యాచ్ లు పూర్తయ్యి ఈ రోజు నుండి సూపర్ 12 జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన జరిగింది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ మంచి ఊపుతో మొదలయినప్పటికీ ఆస్ట్రేలియా క్రమశిక్షణ కలిగిన బౌలింగ్ కు తల వంచక తప్పలేదు. వెంటవెంటనే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాతా ప్రాక్టీస్ మ్యాచ్ లో శతకం బాదిన వండర్ డస్సెన్ హాజిలీవుడ్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో పవర్ ప్లే లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

మార్క్రామ్ మరియు క్లాజెన్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఆసిస్ బౌలర్లు కుదురుకోనివ్వలేదు. అలా నీరసంగా సాగిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఒక దశలో వంద పరుగులు అయినా చేస్తుందా అనుకున్నాము. కానీ రబాడ కొన్ని పరుగులు చేయడంతో 118 పరుగులకు ఇన్నింగ్స్ ను ముగించింది. అయితే ఈ స్కోర్ ను చూసి ఇక ఆస్ట్రేలియా గెలుపు లాంఛనమే అనుకున్నారు. కానీ సౌత్ ఆఫ్రికా బౌలర్లు తమ ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ లతో బంతులు వేసి మ్యాచ్ ను ఆఖరి ఓవర్ వరకు తీసుకొచ్చారు.

ఒక దశలో సౌత్ ఆఫ్రికా ఫేవర్ గా నిలిచింది. ఆఖరి వరకు వచ్చిన ఈ మ్యాచ్ లో ఎంతో ఉత్కంఠ స్థితికి చేరుకుంది.కానీ ఆస్ట్రేలియా అనుభవమైన బాట్స్మన్ ల ముందు ఈ స్కోర్ సరిపోలేదు.  కానీ చివరికి రెండు బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి.

సౌత్ ఆఫ్రికా: 118/9 (20) , మార్క్రామ్ - 40 పరుగులు , హాజిల్ వుడ్ - 2 /19, జంపా - 2 /21  లు ఆకట్టుకున్నారు.

ఆస్ట్రేలియా: 121/5 (19.4) స్మిత్ - 35 పరుగులు మరియు స్థాయినిస్ - 24 పరుగులు, నార్జే - 2/21 ఆకట్టుకున్నారు.

మొదటి మ్యాచ్ లో విజయంతో ఆసీస్ తన తర్వాత మ్యాచ్ లో 28 వ తేదీ శ్రీలంక ను ఢీకొట్టనుంది. సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ తో 26 వ తేదీన తలపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: