వరల్డ్ కప్ గెలవడం ప్రతి జట్టుకు ఎంత ప్రత్యేకమో తెలిసిందే. ఇందుకోసం అన్ని జట్లు ఎంతో ప్రాక్టీస్ చేసి ఎలాగైనా తాము ఆడే ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు. ఈ సారి షెడ్యూల్ ప్రకారం టీ 20 వరల్డ్ కప్ ను కరోనా కారణంగా యూఏఈ మరియు ఒమన్ లు వేదికలుగా ఐసీసీ నిర్వహిస్తోంది. నిన్నటి నుండి సూపర్ 12 మ్యాచ్ లు మొదలయ్యాయి. సూపర్ 12 లో గ్రూప్ 1 లో ఆరు జట్లు మరియు గ్రూప్ 2 లో ఆరు జట్లు ఉన్నాయి. గ్రూప్ 1 లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా మరియు వెస్ట్ ఇండీస్ జట్లు ఉన్నాయి. గ్రూప్ 1 నుండి నిన్న అస్ట్రేలియా - సౌత్ ఆఫ్రికా ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరియు ఇంకో మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లలో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని అందుకుంది.

కాగా గ్రూప్ 2 లో న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్, స్కాట్లాండ్, ఇండియా, నమీబియా మరియు పాకిస్తాన్ లు ఉన్నాయి. ఈ రోజు గ్రూప్ 1 నుండి శ్రీలంక మరియు బంగ్లాదేశ్ తలపడనుండగా సాయంత్రం జరిగే మ్యాచ్ లో గ్రూప్ 2 లో ఉన్న ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే ఉంది. అయితే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల అయిన రోజు నుండి ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో హంగామా మాములుగా లేదు. పాకిస్తాన్ జట్టుపై ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఇండియాకు ఘనమైన రికార్డు ఉంది. అందుకే ఈ మ్యాచ్ లో ఇండియానే ఫేవరేట్.

అయితే ఎప్పటికప్పుడు పాకిస్తాన్ జట్టు ఎంతో డెవలప్ అవుతూ వస్తోంది. తనదైన రోజున ఎంతటి ప్రత్యర్థిని అయినా మట్టికరిపించగల మ్యాచ్ విన్నర్లు పాకిస్తాన్ సొంతం. అందుకే ఇండియా వీరిని లైట్ తీసుకుంటే ప్రమాదమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇంకొన్ని గంటల్లో మొదలు కానున్న ఈ మ్యాచ్ గెలుపెవరిది అనేది అంతటా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: