టీ 20 ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్లో ఈ రోజు భార‌త్ త‌న తొలి మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ ఈ ప్ర‌పంచ క‌ప్ లో జ‌రిగే అన్ని మ్యాచ్ ల కంటే ఎంతో ఉత్కంఠ గా ఉంటుంద‌ని క్రీడాభిమానులు, క్రీడా విశ్లేష‌కులు అభి వ‌ర్ణిస్తున్నారు. ఇందుకు కార‌ణం కూడా ఉంది. భార‌త్ - పాకిస్తాన్ జ‌ట్లు ఎప్పుడు ఎక్క‌డ త‌ల‌ప‌డినా ఆ పోరులో మ‌జా ఉంటుంది.. పోరు ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంది. అలాంటి ది క్ష‌ణం క్ష‌ణానికి ఫ‌లితం మారిపోయే టీ 20 లో అది కూడా ప్ర‌పంచ‌క‌ప్ లో ఈ రెండు జ‌ట్లు ఆడుతున్నాయి .. అంటే పోరు ఎలా మ‌జాగా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ రోజు పాకిస్తాన్ తో మ్యాచ్ లో క‌నుక భార‌త్ గెలిస్తే మన జ‌ట్టు సెమీస్ ఆశ‌లు తొలి మ్యాచ్ తోనే తేలిపోతాయి. ఒక వేళ కీవీస్ తో జ‌రిగే మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోయినా ఈ గ్రూప్ లో ఉన్న మ‌రో మూడు జ‌ట్ల‌ను భార‌త్ సులువుగానే ఓడించేస్తోదంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అప్ఘ‌నిస్తాన్ - స్కాట్లాండ్ - న‌మీబియా ఈ గ్రూప్ లో ఉన్న మ‌రో మూడు జ‌ట్లు.  ఈ మూడు జ‌ట్ల తో జ‌రిగే మ్యాచ్ ల్లో భార‌త్ కాస్త క‌ష్ట‌ప‌డినా సులువుగానే గెలిచేస్తోంది.

అయితే న్యూజిలాండ్‌, పాకిస్తాన్ జ‌ట్ల తో జ‌రిగే మ్యాచ్ ల్లో గెలిచేందుకు మాత్రం భార‌త్ బాగా క‌ష్ట‌ప‌డాల్సి ఉంది. ఒక వేళ ఈ రెండు మ్యాచ్ లు కూడా గెలిచేస్తే అప్పుడు ఈ గ్రూప్ లో భార‌త్ టాప‌ర్ గా నిలుస్తుంది. ఒక వేళ పాకిస్తాన్ తో జ‌రిగే మ్యాచ్ లో భార‌త్ ఓడిపోతే మాత్రం అప్పుడు సెమీస్ కు వెళ్లేందుకు భార‌త్ ప్ర‌తి మ్యాచ్ లోనూ విజ‌యం సాధించ‌డ‌తో పాటు ర‌న్ రేట్ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక న్యూజిలాండ్ తో జ‌రిగే మ్యాచ్ లో కూడా ర‌న్ రేట్ మెరుగు ప‌ర‌చు కుంటూ విజ‌యం సాధించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: