ఇంర్నెష‌న‌ల్ క్రికెట్‌లో చాలా రోజుల త‌రువాత దాయాది దేశాల‌యిన భార‌త్-పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య నేడు హై ఓల్టేజీ పోరు జ‌ర‌గ‌నుంది. చిర‌కాల ప్రత్య‌ర్థుల‌యిన భార‌త్‌, పాక్ ఈ సంవ‌త్స‌రం జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పోటి ప‌డనున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల‌కు తెర‌ప‌డింది. ఈ క్ర‌మంలో కొంత కాలం నుంచి అంత‌ర్జాతీయంగా మ్యాచ్‌ల్లోనే ఆడుతున్నాయి ఇరు దేశాల జ‌ట్లు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా భార‌త్‌-పాక్ మ్యాచ్‌ను ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ నేప‌థ్యంలో ఈ మ్యాచ్ జ‌రుగుతుంది. దీంతో ఈ రోజు జ‌రుగ‌బోయే మ్యాచ్ పై విప‌రీత‌మైన ఉత్కంఠ నెల‌కొంది.


     భార‌త్ జ‌ట్లు స‌మ‌తూకంగా ఉందనే చెప్పాలి. ఇప్ప‌టికే ప్రాక్టిస్ మ్యాచ్ ల‌లో మంచి ఆట తీరును క‌న‌బ‌రిచారు భార‌త ఆట‌గాళ్లు. అటు బ్యాటింగ్ లో ప‌టిష్టంగా ఉంది భార‌త టీం. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ తో పాటు, కెప్టెన్ విరాట్ కోహ్లీ తో లైన‌ప్ గ‌ట్టిగా ఉంది.  మిడిలార్డ‌ర్‌తో పాటు ఆల్ రౌండ‌ర్ లు త‌మ ప్ర‌తిభ ను చూపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మ‌రోవైపు బౌలింగ్ విభాగంలో జ‌స్ప్రీత్ బుమ్రా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, ష‌మీ పేస్ విభాగంలో. స్పిన్న‌ర్లతో భార‌త బౌలింగ్ విభాగం బ‌లియంగా క‌నిపిస్తోంది.

 
   భార‌త్‌లో జ‌ర‌గాల్సిన టి20 ప్ర‌పంచ‌క‌ప్ క‌రోనా కార‌ణంగా యూఏఈకి త‌ర‌లిపోయింది. ఇటీవ‌ల యూఏఈలో భార‌త ఐపీఎల్ ఆడ‌డంతో ఆ అనుభం ఇక్క‌డ ఉప‌యోగ‌ప‌డ‌నుంది. మ‌రోవైపు పాకిస్థాన్ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇప్ప‌టికీ భార‌త్ చేతిలో ఐదు సార్లు ఓట‌మి పాల‌వ్వ‌డంతో.. భార‌త్ విజ‌య ప‌రంప‌ర‌ను నిలువ‌రించాల‌ని పాకిస్థాన్ ప‌ట్టుద‌ల‌తో ఉంది.  పాకిస్తాన్ టీమ్ పై ఆ దేశ ప్ర‌జ‌లు అస‌హ‌నంతో ఉన్నారు. ఎలాగైన గెల‌వాల‌నె ఒత్తిడిలో పాక్ జ‌ట్టు ఉంది.  దీంతో ఎలాగైనా గెల‌వాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తోంది  పాకిస్తాన్ జ‌ట్టు కూడా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ప‌టిష్టంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌త అనుభ‌వాల‌ను భేరీజు వేసుకుంటే ఈసారి కూడా భార‌త్ విజ‌య‌మే ఖాయంగా క‌నిపిస్తోంది.







మరింత సమాచారం తెలుసుకోండి: