పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్.. ఈ రెండు జట్ల మధ్య ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఎంతో ఉత్కంఠగా  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా మ్యాచ్ వీక్షిస్తూ  ఉంటారు. ఈ క్రీడ సమరానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . సామాన్యులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆకర్షిస్తుంది. ఎన్ని పనులు ఉన్నా పక్కకు పెట్టేసి అందరు టీవీలకు అతుక్కుపోతుంటారు. కుదిరితే మ్యాచ్ నేరుగా వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్థాన్ జట్లు మొదటి మ్యాచ్ ఆడబోతున్నాయి. ఇక మొదటి మ్యాచ్ లోనే ఈ రెండు జట్లు తలపడపోతూ ఉండటం గమనార్హం.



 ఈ క్రమంలోనే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఫై ప్రస్తుతం అంతకంతకూ పెరిగి పోతూనే ఉన్నాయి. ఎవరు గెలవబోతున్నారో అనేదానిపై అందరూ ఊహాగానాలలోకి వెళ్లి పోతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో కూడా పాకిస్థాన్ ఫై టీమిండియాదే పైచేయి కావడం గమనార్హం. ఇప్పుడు కూడా వరుస విజయాలతో టీమిండియా జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం పాకిస్థాన్ మ్యాచ్ లో కూడా అంతే దూకుడు కొనసాగించి మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రస్తుతం భారత విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ సారి భారత జట్టుపై గెలిచి చరిత్ర తిరగరాస్తాం అంటూ అటు పాకిస్థాన్ క్రికెటర్లు అంటున్నారు. అయితే ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.



 ఇలాంటి సమయంలో వాతావరణం అనుకూలించక పోతే... మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం కురిసి మ్యాచ్ ఆగిపోతే ప్రేక్షకులకు ఎంత నిరాశ ఎదురవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  మరి మ్యాచ్ జరగబోయే దుబాయ్ లో వాతావరణం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. వాతావరణం పూర్తిగా అనుకూలంగానే ఉంది  ఆకాశం కూడా నిర్మలంగా ఉంది. వర్ష సూచన కనిపించడం లేదు. ఇక నేడు సాయంత్రం ఉష్ణోగ్రత 31 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక వర్షం పడే అవకాశాలు అయితే అస్సలు లేవని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇక సాయంత్రం వేళల్లో తేమ 70 శాతం వరకు ఉంటుందని తెలిపారు. ఇక ఇది క్రికెట్ మ్యాచ్ కి పూర్తిగా అనుకూలించే వాతావరణమే అంటూ తెలిపారు వాతావరణ శాఖ నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: