ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ఈసారి వరల్డ్ కప్ గెలవాలని లక్ష్యంతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఈ ప్రపంచ కప్ లో ఎంతో మంది ఆటగాళ్లు అరుదైన రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకున్నారు.  ఉత్కంఠ భరితంగా సాగుతున్న ప్రతి మ్యాచ్ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి వీక్షిస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు.  కాగా నిన్న భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పైనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టి మొత్తం ఉంది.


 ఇక అదే సమయంలో టి20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ కూడా ఎంతో హోరాహోరీ గానే జరిగింది అని చెప్పాలి. అయితే బంగ్లాదేశ్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు షకీబ్ ఉల్ హాసన్. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాలలో షకీబ్ ఆల్ హాసన్ కూడా ఒకరుగా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు షకీబ్ ఆల్ హాసన్ .  ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.


 టి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షకీబ్ ఆల్ హాసన్ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టాడు ఈ ఆటగాడు. అయితే ఇక ఈ రెండు వికెట్ల తో టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు షకీబ్ ఆల్ హాసన్. ఇప్పటివరకు ఏకంగా నలభై ఒక్క వికెట్లు పడగొట్టాడు. కాగా షకీబ్ ఆల్ హాసన్ ఈ రికార్డు సాధించే ముందు వరకూ ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది (39 వికెట్లు) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇక ఇప్పుడు షకీబ్ ఉల్ హాసన్ ఈ రికార్డును కొల్లగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: