ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్రికెట్ లీగ్ లు ఉన్నాయి. కానీ వాటిలో ఇండియాలో ప్రతి సంవత్సరం జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉండే ఆదరణ ఏ లీగ్ కు లేదనే చెప్పాలి. 2008 నుండి మొన్నటి వరకు మొత్తం 14 సీజన్ లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 8 జట్లు మాత్రమే ఉన్న ఈ లీగ్ లో వచ్చే సీజన్ నుండి 10 జట్లు ఉండనున్నాయి. దీనితో జట్లలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం 2022 జనవరి లో మెగా వేలం జరగనుంది. ఈ వేలం లో ప్రతి ఒక్క ఐపిఎల్ టీమ్ తమ దగ్గర నలుగురు ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకోవాల్సి ఉంది.

ఈ సందర్భంగా ఒక వార్త బీసీసీఐ లో హల్ చల్ చేస్తోంది. గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ గా ఉన్న జట్టును రెండు సంవత్సరాల క్రితం నుండి ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. పేరు మార్చినప్పటి నుండి ఈ జట్టు రాత మారిందని చెప్పాలి.  2020 లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ వరకు వెళ్లగా ఆ తర్వాత జరిగిన సీజన్ 14 సమయానికి గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఇండియాలో జరిగిన మొదటి దశ ఐపీఎల్ మ్యాచ్ లకు దూరం అయ్యాడు. అందుకే అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్ ను కెప్టెన్ గా నియమించింది ఢిల్లీ యాజమాన్యం. రిషభ్ కెప్టెన్సీ లో సైతం జట్టు మంచి ప్రదర్శననే కనబరిచింది. ఈ సారి పాయింట్ల పట్టికలో మొదటి స్థానం చేజిక్కించుకుని ప్లే ఆప్స్ కు చేరువైంది.  కానీ ఫైనల్ కు వెళ్ళడంలో విఫలం అయింది.

అయితే రానున్న ఐపిఎల్ సీజన్ కు రిషభ్ నే కెప్టెన్ గా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా మాత్రం ఢిల్లీ అంటిపెట్టుకుని ఆటగాళ్లలో రిషభ్, శ్రేయస్ అయ్యర్, నార్జే మరియు రబాడ లు ఉండే అవకాశం ఉంది. అయినా ఎందుకో ఆ జట్టు మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఢిల్లీని వీడనున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ సారి జరిగే మెగా వేలానికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు వైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రియాక్టు కాలేదు. ఒకవేళ ఇది నిజమయితే ఢిల్లీ క్యాపిటల్స్ కు పెద్ద షాక్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: