దుబాయ్ లో జ‌రుగుత‌న్న టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ రోజు రోజు కు ర‌స‌వ‌త్తంగా జరుగుతుంది. బ‌లం గా ఉన్న జ‌ట్లే దారుణంగా విఫ‌లం అవుతున్నాయి. ఇప్ప‌టికే పాకిస్థాన్ చేతిలో టీమిండియా దారుణంగా ఓట‌మి పాల‌యింది. ఈ మ్యాచ్ త‌ర్వాత దాదాపు వారం రోజుల త‌ర్వాత అంటే ఈ నెల 31 న న్యూజీ లాండ్ తో టీమిండియా త‌ల ప‌డ‌నుంది. అయితే ఇప్ప‌టికే టీమిండియా ఆడిన ఒక మ్యాచ్ లో ఓడి పోవ‌డం తో ఈ మ్యాచ్ లో త‌ప్ప‌క గెలిచి ప‌రువు నిల‌బెట్టు కోవాల‌ని చూస్తుంది. అయితే ఈ నెల 31 న న్యూజీ లాండ్ తో జ‌ర‌గబోయే మ్యాచ్ కు కొన్ని మార్పులు త‌ప్ప‌క చేయాల్సిందేన‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు.



అయితే పాక్ తో జ‌రిగిన మ్యాచ్ లో రోహిత్ గోల్డ‌న్ డౌక‌ట్ అయినా.. రోహిత్ పక్క‌న పెట్ట‌డం ఆసాధ్యం. అంతే కాకుండా రోహిత్ తో పాటు కే ఎల్ రాహుల్ తో నే ఓప‌నింగ్ చేయించే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే సూర్య కుమార్ యాద‌వ్, పంత్ ఎలాగు తుది జ‌ట్టు లో త‌ప్ప‌ని స‌రిగా ఉంటారు. అయితే స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్ధిక్ పాండ్య న్యూజీ లాండ్ తో జ‌ర‌గ‌బోయే తుది జ‌ట్టు లో ఉండ‌టం కాస్త అనుమాన‌మే అని చెప్పాలి. అయితే పాండ్య గ‌త కొద్ది రోజుల నుంచి ఫామ్ లేమి తో బాధ ప‌డుతున్నాడు. దీంతో పాండ్య స్థానంలో ఇషాన్ కిషాన్ ను తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. కిషాన్ తుది జ‌ట్టు లోకి వ‌స్తే సూర్య కుమార్ యాద‌వ్ , పంత్, కిషాన్ తో మిడిలార్డ‌ర్ బ‌లంగా ఉంటుంది.



అలాగే మ‌రొక్క ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కూడా సరైన ఫామ్ లో ఉండ‌టం లేదు. అయితే జ‌డేజా ను ప‌క్క‌కు పెట్టే స‌హసం కెప్టెన్ కోహ్లి చేయ‌లేడు. ఎందుకంటే జ‌డేజా కొంచం ట‌చ్ లోకి వ‌చ్చినా.. అటు బ్యాట్ తో ఇటు బాల్ తో చాలా అద్భుతాలు చేయ‌గ‌ల‌డు. అయితే ప్ర‌ముఖ స్వింగ్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ పై వేటు ప‌డే అవ‌కాశాలు ఎక్కువ గా ఉన్నాయి. భువ నేశ్వ‌ర్ కూడా గ‌త కొద్ది రోజుల నుంచి త‌న ఫామ్ తో ఇబ్బంది ప‌డుతున్నాడు. దీంతో భువ‌నేశ్వ‌ర్ స్థానంలో యువ సంచ‌ల‌నం శార్ధుల్ ఠాకుర్ ను తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే శార్థుల్ కేవ‌లం బాల్ తోనే కాదు బ్యాట్ తోనూ స‌త్త చాటే అవ‌కాశం ఉన్న ఆట‌గాడు కాబ‌ట్టి శార్ధుల్ వైపు మొగ్గు చూపే అవ‌కాశం. అయితే ఈ మార్పు ల‌తో టీమిండియా బ‌రి లోకి దిగితే త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని క్రికెట్ విశ్లేశ‌కులు కూడా అభిప్రాయ ప‌డుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: