ఒక దేశ క్రికెట్ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణ‌యం యావ‌త్ క్రీడా ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో ఒక పెను మార్పులు చేసే విధంగా ఆ దేశం నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశ పురుషుల జ‌ట్టు కు కోచ్ గా ఒక మ‌హిళా ప్లేయ‌ర్ ను ఎంపిక చేసింది. ఈ సంచల‌న నిర్ణ‌యం త‌మ దేశానికి ఉన్న క్రిడా స్ఫూర్తి ని, మ‌హిళ ప‌ట్ల ఉన్న గౌర‌వాన్ని చాటింది. అది ఏ దేశమో కాదు.. అది కూడా ఒక అర‌బ్ దేశానికి చెందిన క్రికెట్ ఫ్రొంచైజ్. సాధార‌ణంగా ముస్లిం దేశాలలో మ‌హిళ ల‌పై అనేక మైన ఆంక్ష‌లు ఉంటాయి. అలాగే మ‌హిళ ల పై అనేక క‌ట్టుబాట్లు ను కూడా పెడుతాయి.



అయితే ఆ ఆంక్లల‌ను, క‌ట్టు బాట్లను త‌ల‌కిందులు చేస్తు ఈ నిర్ణ‌యం తీసుకుంది. అబుదాబీ దేశానికి చెందిన ఒక ఫ్రోంచైజీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆ దేశంలో ప్ర‌తి ఏడాది టీ 10 లీగ్ ల‌ను నిర్వ‌హిస్తారు. అయితే ఈ లీగ్ లో ఒక ఫ్రోంచైజీ కి ఒక మ‌హిళా ప్లేయ‌ర్ ను అసిస్టెంట్ కోచ్ గా నియ‌మించింది. ఆ ప్లేయ‌ర్ ఎవ‌రో కాదు..మాజీ ఇంగ్లండ్ వికెట్ కీప‌ర్, స్టార్ బ్యాట‌ర్ సారా టేల‌ర్. ఆ విషయాన్ని అబుదాబి త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. అయితే అబుదాబి తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల పురుషుల ఫ్రోంచైజీ చ‌రిత్ర‌లో ఒక మ‌హిళా కోచ్ ఉండ‌టం ఇదే మొద‌టి సారి. అయితే సారా టేల‌ర్ కూడా ఇంగ్లాండ్ మ‌హిళ క్రికెట్ జట్టు విజ‌యాల్లో చాలా కీల‌క పాత్ర పోషించింది. అలాగే ఇంగ్లాండ్ మ‌హిళ జ‌ట్టు సాధించిన రెండు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ల తో పాటు ఒక టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ లోనూ సారా టేల‌ర్ ప్రాతినిథ్యం వ‌హించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: