టోక్యో  ఒలింపిక్స్‌  లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో  జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించి భారతీయ కీర్తిని ప్రపంచ నలుమూలల వ్యాపింప జేశాడు. ఈ విజయం తో దాదాపు 100 యేళ్ళనాటి కళ సాకారం అయ్యింది. అభినవ్ బింద్రా తరువాత ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన ఆటగాడిగా నీరజ్ చోప్రా నిలుస్తాడు. అయితే  ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో నీరజ్ చోప్రా 87.58 మీటర్లు జావెలిన్ త్రో విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. నీరజ్ తరువాతి స్థానం లో చెక్ రిపబ్లిక్ త్రోయర్లు రెండు, మూడవ స్థానాలలోఆక్రమించారు .

IHG చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ ఒలంపిక్స్ విన్నర్ నీరజ్  కు ఒక కోటిరూపాయలను బహుకరించింది. దాంతోపాటుగా అతనిపేరుమీద ఓ కొత్త జెర్సీ ని విడుదల చేసింది. ఆ జెర్సీ పై 5758  అనే నుంబర్ ను ముద్రించడం గమనార్హం ఎందుకంటె నీరజ్ చోప్రా ట్రాక్ అండ్ ఫీల్డ్  లో 87.58 మీటర్లు జావెలిన్ త్రో విసిరి స్వర్ణాన్ని సాధించాడు కాబట్టి అతడి జ్ఞాపకార్థం ఆ జెర్సీ పై నుంబర్ ను ప్రింట్ చేశారు. ఇదిలావుండగా నీరజ్.. మహీంద్రా కంపెనీ నుండి  ‘ఎక్స్‌యూవీ700’ అనే కారును గిఫ్ట్ గా అందుకున్నాడు. నీరజ్ స్వర్ణం గెలిచినా తరువాత ఆనంద్ మహీంద్రా నీరజ్ కు ప్రత్యేకంగా డిజైన్ చేసి   ‘ఎక్స్‌యూవీ700’ ను బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చాడు . అందుకే  ‘ఎక్స్‌యూవీ700’ కారును నీరజ్ ఇంటికి పంపించాడు. 



IHGఈ విషయాన్నీ నీరజ్ తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశాడు కూడా . స్వతహాగా రైతు బిడ్డ అయినటువంటి నీరజ్ యూట్యూబ్ లో జావెలిన్ త్రో గురించిన టెక్నిక్స్ నేర్చుకోవడం విశేషం. 2018 ఆసియా క్రీడల్లో జావెలిన్‌ని 88.06 మీటర్లు త్రో చేసి  గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా తరువాత చేతి గాయం కారణంగా కొంత కాలం అథ్లెటిక్స్ కి దూరంగా ఉన్నాడు. అయితే నీరజ్ ను  భారత అత్యున్నత క్రీడా పురస్కారం అయినటువంటి  మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న-2021 వరించింది

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: