ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది అనుకున్న ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. గత మ్యాచ్ లో లాగానే మొదట కోహ్లీ టాస్ ఓడిపోయాడు. మ్యాచ్ ముందు నుండి  మానము చెబుతున్న ప్రకారం టాస్ కీలకం అయింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియంసన్ ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఒత్తిడిలో ఉన్న ఇండియా తడబడుతూ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఈ మ్యాచ్ లో రెండు కీలక మార్పులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్ మరియు భువి స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. రాహుల్ తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇషాన్ కిషన్ టెంప్ట్ అయి ఫీల్డర్ చేతికి చిక్కాడు.  

ఆ తర్వాత వరుస పెట్టి రాహుల్, రోహిత్ లు పవిలియన్ చేరారు. కాసేపు పంత్ తో కుదురుకున్నట్టే కనిపించిన కోహ్లీ  షోధి బౌలింగ్ లో భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. ఎవ్వరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఒక్క జడేజా ఒక్కడే 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 110 పరుగులకు పరిమితం అయింది. దీనితో సెమీఫైనల్ ఆశలు నీరుగారినట్టే. ఇక మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడటం తప్పితే చేసేదేమీ లేదు. ఇంత దారుణంగా ఇండియా ఫెయిల్ అవుతుందని అనుకోలేదు. ఇది ఎవరూ ఊహించని ప్రదర్శన అని చెప్పాలి.

111 పరుగుల లక్ష్యంతో చేదన ప్రారంభించిన కివీస్ ఆదిలోనే గుప్తిల్ వికెట్ ను కోల్పోయింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. మరో ఓపెనర్ డారిల్ మిచెల్ భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక ఇండియా ఓటమి లాంఛనమే... కివీస్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం సాధించి విజయానికి కొంత దూరంలో నిలిచింది. వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ బ్యాట్స్ మాన్ విఫలం అయ్యారు. టీమిండియా ఏదో తప్పు చేస్తోంది. దానిని సరిచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: