ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ బి లో ఈరోజు రెండో మ్యాచ్ న్యూజిలాండ్, ఇండియా జట్ల మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఏ సమయంలోనూ మ్యాచ్ ఇండియా చేతిలో ఉన్నట్లు అనిపించలేదు. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో చేతులెత్తేసారు భారత ఆటగాళ్లు. అయితే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 110 పరుగులు చేసి 7 వికెట్లు నష్టపోయింది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా 26 పరుగులు, హార్థిక్ పాండే 23 పరుగులే అత్యధికం. అయితే టాస్ గెలిచి ఛేజింగ్ తీసుకున్న కివీస్ జట్టు ముందు భారత్ ఉంచిన 111 పరుగుల లక్ష్యం వారికి ధైర్యాన్ని ఇచ్చింది.

అయితే కివీస్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ మార్టిన్ గుప్టిల్ 17 బంతుల్లో 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో కలిసి మరో ఓపెనర్ డారిల్ మిచెల్ ఈ క్రమంలో 35 బంతుల్లో 49 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే అప్పటికే న్యూజిలాండ్ జట్టు 96 పరుగులు చేసింది. దాంతో మిగిలిన పరుగులను కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొత్తగా వచ్చిన బ్యాటర్ డెవాన్ కాన్వే(2) తో  కలిసి 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించాడు. దాంతో న్యూజిలాండ్ జట్టు భారత జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారికి సెమీస్ ఆశలను సజీవంగా ఉంటాయని తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్లో విజయం సాధించిన కివీస్ జట్టు తన సెమీస్ ఆశలను నిలుపుకుంటే... ఓడిపోయిన కోహ్లీసేన దాదాపుగా ఇంటిదారి పట్టేసింది. అయితే కోహ్లీ జట్టుకి ఇప్పటికీ ఈ టోర్నీలో ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కనీసం మూడు మ్యాచ్లోనైనా గెలిచి భారత జట్టు ఈ టోర్నీ ముగిస్తుంది అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: