టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ లో టీమిండియా త‌న పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగిస్తూనే ఉంది. ఇప్ప‌టికే దాయాది జ‌ట్టు అయిన పాకిస్థాన్ తో ఘోరమైన ఓట‌మిని చ‌వి చూసింది. తాజాగా మ‌రో ఒక ఓట‌మి ని కూడా టీమిండియా ముటగ‌ట్టు కుంది. ఆది వారం రాత్రి న్యూజి లాండ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో న్యూజి లాండ్ కు టీమిండియా ఏ విధంగా కూడా పోటీ ఇవ్వ లేక పోయింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ క‌నీస పోటీ కూడా ఇవ్వ‌లేదు. పాక్ జ‌ట్టు పై కూడా ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న తో నే టీమిండియా ఓట‌మి పాల‌యింది. అయితే ఆది వారం రాత్రి టీమిండియా పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడ‌తో ఓట‌మి పాల‌యింది.



ఇదీలా ఉండ‌గా టీమిండియా వ‌రుస‌గా ఓడి పోవ‌డం పై భార‌త  అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అంత కాకుండ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పై, కోచ్ ర‌వి శాస్త్రి పై సోష‌ల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ వ‌స్తున్నాయి. అయితే న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లి తీసుకున్న నిర్ణ‌యం అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఓపెనింగ్ చేయ‌డానికి కెల్ రాహుల్ తో పాటు ఇషాన్ కిష‌న్ ను సెల‌క్ట్ చేశారు. అయితే కెల్ రాహుల్ అనుభ‌వం ఉన్న ఆట‌గాడే. కానీ ఇషాన్ కిష‌న్ కు అంత‌ర్జాతీయం గా టీ ట్వంటి లు ఆడిన అనుభవం చాలా త‌క్కువ గా ఉంది. దీంతో ఇషాన్ కిష‌న్ ను ఓపెనింగ్ చేయిచ‌డం పై ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు త‌ప్పు ప‌డుతున్నారు. ఒక వేలా ఇషాన్ కిష‌న్ ఓపెనింగ్ చేయించినా.. అత‌ని కి తోడు గా రోహిత్ శ‌ర్మ ను పంపించాల్సింది అని త‌మ అభిప్రాయం చెబుతున్నారు. ఇలాంటి నిర్ణ‌యాలు తీసు కోవ‌డం వ‌ల్లే టీమిండియా వ‌రుస‌గా ఓడి పోతుంద‌ని అభిమానులు అంటున్నారు. కాగ ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ గా వ‌చ్చిన ఇషాన్ కిషాన్ 8 బంతుల‌ల్లో 4 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అలాగే మ‌రొక్క ఓపెన‌ర్ కెల్ రాహుల్ 16 బంతుల్లో 18 ప‌రుగులు చేశాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: