చివరి టాస్ గెలిచిన కోహ్లీ.. బౌలింగ్ తీసుకున్న ఇండియా

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ 2021 ప్రపంచకప్లో ఈరోజు భారత్ జట్టు తన ఆఖరి మ్యాచ్ ను నమీబియాతో ఆడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా రెండింటిలో ఓడిపోయి సెమీ ఫైనల్స్ కి వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచి ఓడిన భారత జట్టు సెమీస్ కు వెళ్లే అవకాశం ఉండదు. అయితే ఈ మ్యాచ్ టీ 20 ఫార్మెట్ లో విరాట్ కోహ్లీకి భారత కెప్టెన్ గా ఆఖరి మ్యాచ్. కాబట్టి ఇందులో విజయం సాధించి  కోహ్లీకి మంచి వీడ్కోలు ఇవ్వాలని భారత జట్టు చూస్తోంది. అయితే కెప్టెన్ గా ఈ ఆఖరి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బౌలింగ్ తీసుకొని ప్రత్యర్థి జట్టు అయినా నమీబియా ను మొదట బ్యాటింగ్ కు పంపిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు ఒక్క మార్పు చేసుకొని బరిలోకి వస్తుంటే... నమీబియా మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి వస్తుంది. అయితే భారత జట్టు ఒక్క మార్పు వరుణ్ చక్రవర్తి స్థానంలో రాహుల్ చహర్ నో జట్టులోకి తీసుకొని వచ్చింది. అయితే కోహ్లీ కోసం ఈ మ్యాచ్లో తప్పకుండా విజయం సాధించాలని భావిస్తుంది ఇండియా. ఇక నమీబియా కూడా ఈ ప్రపంచ కప్ సెమీస్ నుండి వైదిలిగింది కాబట్టి.. ఈరోజు తమ ఆఖరి మ్యాచ్ ను గెలిచి టోర్నీ నుండి నిష్క్రమించాలని అనుకుంటుంది. చూడాలి మరి భారత్ విజయం సాధించి కోహ్లీకి గిఫ్ట్ ఇస్తుందా లేదా అనేది.

ఇండియా : కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

నమీబియా : స్టీఫన్ బార్డ్, మైఖేల్ వాన్ లింగేన్, క్రెయిగ్ విలియమ్స్, గెర్హార్డ్ ఎరాస్మస్(c), జేన్ గ్రీన్(w), డేవిడ్ వైస్, జాన్ ఫ్రైలింక్, JJ స్మిట్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్

మరింత సమాచారం తెలుసుకోండి: