భారత అంతర్జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలి అనుకునే వారికి ప్రస్తుతం బీసీసీఐ నిర్వహించె ఇండియన్ ప్రీమియర్ లీక్  ఆటగాళ్లు అందరికీ కూడా ఒక మంచి వేదికగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో అవకాశం దక్కించుకొని ఐపీఎల్లో తమ సత్తా చాటి బిసిసిఐ సెలెక్టర్ లను ఆకర్షిస్తున్నారు. ఇలా ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతోన్న యువ ఆటగాళ్లు అందరూ కూడా ఐపీఎల్ లో సత్తా చాటి భారత జట్టులో స్థానం సంపాదించుకున్న వారే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  బీసీసీఐ నిర్వహించె ఐపీఎల్లో ప్రతి సీజన్లో కూడా కొత్త యువ సూపర్ స్టార్ వెలుగులోకి వస్తూనే ఉన్నాడు. అసమాన్యమైన ప్రతిభతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నారు ఎంతో మంది యువ ఆటగాళ్లు.




 అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా తమదైన శైలిలో అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. అలాంటి వారిలో ఢిల్లీ జట్టులో పృథ్వీ షా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో దేవదత్ పడిక్కాల్ , సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో ఉమ్రాన్ మాలిక్ లు కూడా అద్భుతంగా రాణించారు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొట్టారూ. అయితే ఇక వీరికి భారత టి20 జట్టులో స్థానం దక్కుతుంది అని అనుకున్నారు అందరు.  కానీ ఇటీవల న్యూజిలాండ్తో స్వదేశంలో ఆడబోయే టి20 సిరీస్ కోసం బిసిసిఐ ఎంపిక చేసిన జట్టులో వీరికి చోటు దక్కకపోవడం గమనార్హం.


 అయితే అదే సమయంలో అటు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత ఏ జట్టుకు మాత్రం ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు ఈ ముగ్గురు ఆటగాళ్లు. ఈ నెల 23వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 టి20 సిరీస్ కోసం 14 మంది సభ్యుల భారత జట్టును ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ. ఇలా పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండి ఉన్న ఈ జట్టు సారథిగా ప్రియాంక్ పంచల్ ని ఎంపిక చేసింది. అదే సమయంలో ఇక ఈ జట్టులో సీనియర్లు గా ఉన్న రాహుల్ చహర్, నవదీప్ సైనీ లు కూడా చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇక ఈ పర్యటనలో అద్భుతంగా రాణించి మరికొన్ని రోజుల్లో టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నారు యువ క్రికెటర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: