క్రికెట్ లో జాతీయ జట్టులో స్థానం సంపాదించడం ప్రతి ఒక్క క్రికెటర్ కల. ఈ కలను సాకారం చేసుకోవడానికి దేశవాళీ స్థాయిలో వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకుని రాణిస్తూ ఉంటారు. ఇంత వరకు మాత్రమే వీరి చేతుల్లో ఉంటుంది. జాతీయ జట్టులో ఆదే అదృష్టం రావాలంటే మాత్రం బీసీసీఐ సెలక్టర్స్ దృష్టిలో పడాల్సిందే. ఇదిలా ఉంటే టీ 20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు కథ ముగిసింది. ఎన్నో అంచనాలతో టీ 20 ప్రపంచ కప్ లో అడుగుపెట్టిన ఇండియాకు పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ జట్లు భారీ షాక్ ఇచ్చాయి. దీనితో లీగ్ దశలో ఈ ఇంటి ముఖం పట్టింది. 

ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టుతో 3 టీ 20 లు మరియు 2 టెస్ట్ లు ఆడనుంది. అందుకోసం టీ 20 భారత్ జట్టును బీసీసీఐ సెలక్టర్లు రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఈ జట్టులో ఐపిఎల్ లో రాణించిన వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్ మరియు ఆవేష్ ఖాన్ లకు అవకాశం కల్పించారు. కానీ ఒక ఆటగడిని మాత్రం విస్మరించారు. వేలకొద్దీ పరుగులు చేస్తున్నా ఇతనిని బీసీసీఐ సెలెక్టర్స్ పట్టించుకోలేదు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో చూద్దాం.

35 సంవత్సరాల వయసున్న సౌరాష్ట్ర జట్టుకు చెందిన షెల్డన్ జాక్సన్ ఇప్పటికీ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. 2019 లో జరిగిన రంజీ ట్రోఫీ లో షెల్డన్ జాక్సన్ 854 పరుగులు, అలాగే 2019/20 రంజీ ట్రోఫీ లో 809 పరుగులు చేశాడు. అంతే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్టాక్ అలీ ట్రోపీలో కూడా అధ్బుతంగా రాణిస్తున్నాడు. అయినా ఇంత ప్రతిభ కలిగినా అవకాశం ఇవ్వని బీసీసీసి సెలక్టర్లు ఇంకా ఏమి చేస్తే  అవకాశం ఇస్తారు అని భారత్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఇకనైనా షెల్డన్ జాక్సన్ లాంటి వారిని ఆదరిస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: