ఇటీవల భారీ అంచనాల మధ్య టి20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగిన టీమిండియా జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఇక ఆ తర్వాత మూడు మ్యాచ్లలో అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ సెమీఫైనల్లోకి మాత్రం అవకాశాలు దక్కించుకోలేక ఇంటి బాట పట్టింది. అయితే చాలా రోజుల తర్వాత ఇక ఇటీవల స్వదేశంలో మ్యాచ్ లకి ప్లాన్ చేసింది బిసిసిఐ. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ జట్టుతో వరుసగా టీమ్ ఇండియా టెస్ట్, టి20 సిరీస్ కూడా ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్టు సిరీస్కు బీసీసీఐ ఇటీవలే భారత జట్టును కూడా ప్రకటించింది. స్వదేశంలో జరగబోతున్న రెండు టెస్టులకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును వివరాలను ఇటీవలే సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది బీసీసీఐ .


 అయితే టీమ్ ఇండియా లో కొంత మంది క్రికెటర్లు గత కొంత కాలం నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఓ వైపు బయో బాబుల్ లో క్వారంటైన్   లో ఉంటూ మరోవైపు ఒత్తిడిని కూడా తట్టుకుంటూ క్రికెట్ ఆట ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక ఎన్నో రోజుల నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ భావించింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ కి గైర్హాజరీ కాబోతున్నాడు. దీంతో ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న అజింక్యా రహానే కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.



 అయితే ఇండియా న్యూజిలాండ్ తో ఆడబోయే టెస్ట్ సిరీస్ కోసం ఇక జట్టుకు కెప్టెన్గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లలో ఎవరో ఒకరు సారథులుగా ఉంటారు అని అనుకున్నారు అందరు. కానీ ఈ ఇద్దరూ కాకుండా ఏకంగా అజింక్య రహనే కు టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ఇటీవల బిసిసిఐ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో వివరాలు ఇలా ఉన్నాయి. అజింక్య రహానే(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్ పుజారా(వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ఆర్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ, విరాట్‌ కోహ్లి(రెండో టెస్టు నుంచి అందుబాటులోకి).

మరింత సమాచారం తెలుసుకోండి: