న్యూజిలాండ్ మరో సమరానికి సిద్ధమైంది. ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన మూడు రోజులకే మరో సిరీస్ కు సన్నద్ధం అయింది. ఈ సారి విలియంసన్ రెస్ట్ తీసుకున్నాడు. కెప్టెన్ గా సీనియర్ ప్లేయర్ టిమ్ సౌథీ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. మరో టీ 20 ప్రపంచ కప్ కు పది నెలలే ఉండడంతో ఈ సిరీస్ న్యూజిలాండ్ కి అన్ని విధాలుగా ఉపయోగపడనుంది. విలియమ్సన్ లేకుండా బరిలోకి దిగుతున్న కివీస్ ను ఇండియా అడ్డుకుంటుందా అన్నది తెలియాలంటే ఇంకాస్తసేపు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ సిరీస్ కు భరత్ వైపు నుండి కూడా కీలక ప్లేయర్లు రెస్ట్ తీసుకోవడం జరిగింది. వరుస సిరీస్లు ఆడుతూ అలసిపోయిన కోహ్లీ, బుమ్రా, షమీ, జడేజా మరియు హార్దిక్ పాండ్య లకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది.

ఇప్పుడు పూర్తి స్థాయిలో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో మొదటి సిరీస్ ఆడనుంది. మరి రోహిత్ ఏ విధంగా టీం ను నడిపిస్తాడో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇటీవల కోహ్లీ కెప్టెన్సీకి శుభం పలికిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కు భారత్ జట్టుకు ఎంపికయిన ఐపీఎల్ ప్లేయర్స్ పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ టోర్నీకి వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ లకు ఈ సిరీస్ ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించిన వీరికి టీం ఇండియాలో ఆడేందుకు అవకాశం వచ్చింది.

అయితే స్క్వాడ్ లో ఉన్నప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఒకవేళ వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటే అప్పుడు ఆఖరి మ్యాచ్ లో యువ ప్లేయర్స్ ను ఆడిస్తారని అభిప్రాయపడుతున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: