భారత క్రికెట్లో ఇటీవలే కోచ్ రవి శాస్త్రి- కెప్టెన్ కోహ్లీ శకం ముగిసింది అన్న విషయం తెలిసిందే. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో బీసీసీఐ టీమిండియాకు కొత్త కోచ్ గా రావిశాస్త్రిని నియమించింది. అయితే రావిశాస్త్రిని కోచ్గా నియమించిన సమయంలో ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. క్రికెట్ లో ఎక్కువగా అనుభవం లేని రవిశాస్త్రిని కోచ్ గా నియమించడం ఏంటి అంటూ  ఎంతో మంది తీవ్రస్థాయిలో కామెంట్లు కూడా చేసారు. కానీ రవిశాస్త్రి కోచింగ్ మాత్రం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రావిశాస్త్రి విరాట్ కోహ్లి కాంబినేషన్ లో టీమిండియా ఎంతో అద్భుతంగా రాణించింది.


 కేవలం స్వదేశీ గడ్డపై నే కాదు విదేశీ పర్యటనల్లో సైతం అటు టీమిండియా అద్భుతంగా ముందుకు సాగింది అని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో మరపురాని విజయాలను కూడా సాధించింది. అయితే ఇటీవలే వీరిద్దరూ కాంబినేషన్ కు స్వస్తి పలికి కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల విరాట్ కోహ్లీ తన టి20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అదే సమయంలో ఇటీవలే టి20 వరల్డ్ కప్ చివరి మ్యాచ్లో రవిశాస్త్రి కోచ్గా సమయం కూడా ముగిసిపోయింది. దీంతో కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా కొత్త కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఎంపిక అయ్యాడు.



 అయితే ఇటీవలే విరాట్ కోహ్లీ రావిశాస్త్రి కాంబినేషన్ గురించి భారత దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవిశాస్త్రి విరాట్ కోహ్లీ కాంబినేషన్కు తాను నూటికి తొంభై మార్కులు ఇస్తాను అంటూ కపిల్దేవ్ చెప్పుకొచ్చాడు. ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని అందుకు 10 మార్కులు తగ్గిస్తున్నట్లు గా చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్. ఇక ట్రోఫీ మాట పక్కన పెడితే వీరిద్దరి భాగస్వామ్యంలో ఐదు సంవత్సరాలపాటు టీమిండియా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ తెలిపాడు. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లను సైతం టీమిండియా కైవసం చేసుకుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: