ఈరోజు భారత్, న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు న్యూజిలాండ్ ను మొదట బౌలింగ్ పంపించింది. దాంతో బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ జట్టుకు భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్లోనే షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ డారిల్ మిచెల్ ను మొదటి బంతికే పెవిలియన్ కి పంపించాడు. కానీ ఆ తర్వాత రెండో వికెట్కు మార్టిన్ గప్టిల్, మార్క్ చాప్మన్ 110 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 50 బంతుల్లో 63 పరుగులు చేసి మార్క్ చాప్మన్ అవుటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ గప్టిల్ 42 బంతుల్లో 70 పరుగులు చేసి వెనుదిరిగాడు. యూజ్ ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ మూడు బంతుల్లో ఒక పరుగు కూడా చేయకుండా డకౌట్ అయ్యాడు. అలాగే వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ 11 బంతుల్లో 12 పరుగులు చేయగా... రచిన్ రవీంద్ర 8 బంతుల్లో 7 పరుగులు చేశాడు. ఇక మిచెల్ సాంట్నర్ 4 బంతుల్లో 4 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేయగలిగింది.

ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా... దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 165 పరుగులు చేయాలి. అయితే న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొని భారత బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని ఛేదించగల అనేదే ప్రశ్న. అయితే మన భారత ఓపెనర్లు ఇద్దరు మంచి ఫామ్లో ఉండటంతో జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఈరోజు మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుందా లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: