భారత్లో క్రికెట్ ఆట కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఇండియా లో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ మాత్రం మరో ఆటకి లేదు అని చెప్పాలి. ఇక రోజురోజుకీ అంతకంతకూ క్రేజ్ సంపాదించుకుంటు దూసుకుపోతుంది క్రికెట్. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఉత్కంఠభరితంగా బంతికి బాల్ కి మధ్య సాగే పోరు వీక్షించడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే మొన్నటి వరకు భారత్ లో కేవలం పురుషుల క్రికెట్ కి మాత్రమే ఎక్కువగా క్రేజ్ ఉండేది. పురుషుల క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు మాత్రమే చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు ప్రేక్షకులు.



 కానీ ఇప్పుడు మాత్రం మహిళా క్రికెటర్లు కూడా అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతున్నారు. పురుష క్రికెటర్లకు తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తూ అదరగొడుతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నారు మహిళా క్రికెటర్లు. దీంతో అటు మహిళా క్రికెట్ కి కూడా భారత్లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పాలి. కేవలం భారత్లో మాత్రమే కాదు ఇండియన్ మహిళా క్రికెటర్లకు అటు విదేశాల్లో కూడా క్రేజ్ పెరిగిపోతుంది అన్నది అర్థం అవుతుంది. విదేశీ లీగ్ లలో కూడా ఆడుతూ అదరగొడుతున్నారు మహిళా క్రికెటర్లు. అయితే ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన  స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్నారు.


 ఇటీవలే స్మృతి మందాన ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో కొంతమంది మాత్రమే భారత క్రికెటర్లు అవకాశం దక్కించుకుంటూ ఉంటారు. ఇలా అవకాశాన్ని దక్కించుకుంది స్మృతి మందాన  ఉమెన్స్ బిగ్ బాస్ లీగ్ లో తొలి శతకం సాధించిన భారత మహిళా క్రికెటర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. స్మృతి మందాన సిడ్నీ థండర్ జట్టు తరఫున ఆడింది.  మెల్బోర్న్  జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించి 114 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది స్మృతి మందన.

మరింత సమాచారం తెలుసుకోండి: