మొన్నటివరకు టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఇక ఇటీవల కొత్తగా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్. ఇక రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టడం పై ఇక క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు అని చెప్పాలి. రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో టీమిండియా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంది అని  ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మొన్నటి వరకు అండర్ 19 జట్టుకు కోచ్ గా ఉండి టీమిండియాకు ఎంతో మంది యువ ఆటగాళ్లను అందించాడు రాహుల్ ద్రవిడ్ ఇక ఇప్పుడు ఏకంగా టీమిండియాకు హెడ్ కోచ్ గా మారిపోయాడు.


 అయితే ఇక రోహిత్ శర్మ కొత్త కెప్టెన్గా జట్టు బాధ్యతలు చేపట్టగా అదే సమయంలో ఇక రాహుల్ ద్రవిడ్ కూడా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టడంతో భారత క్రికెట్ లో కొత్త శకం మొదలైంది అని అందరూ భావించారు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ హెడ్ కోచ్ పదవి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2021 జరుగుతున్న సమయంలోనే తనకు టీమిండియా హెడ్ కోచ్ పదవి ఆఫర్ వచ్చిందని కానీ వర్క్ లోడ్ దృశ్య అవకాశాన్ని తిరస్కరించాలని వచ్చింది అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హెడ్ కోచ్ గా ఉన్నాను. సంవత్సరంలో 300 రోజులు భారత్లోనే గడుపుతున్నాను. ఇక ఒకవేళ టీమిండియా క్రికెట్ కోచ్గా వెళితే రెండు పనులను బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం.. అయితే రాహుల్ ద్రవిడ్ ను హెడ్ కోచ్గా నియమించడంపై ఒక్క క్షణం పాటు ఆశ్చర్యానికి గురయ్యా అంటూ చెప్పుకొచ్చాడు. అండర్-19 క్రికెట్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పాత్ర ఎంతో అభినందనీయం అంటూ తెలిపాడు. అయితే అతడిని బీసీసీఐ హెడ్ కోచ్ గా నియమించడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ బీసీసీఐ మంచి పని చేసింది అతని పర్యవేక్షణలో టీమిండియా మరింత రాటు దేలుతోంది అన్న విషయం మాత్రం పక్కా గా చెప్పగలను అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: