భారత క్రికెట్లో ఎనలేని సేవలు అందించి ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో ఏకంగా భారత జట్టుకు 3 వరల్డ్ కప్ లు  అందించి ప్రస్తుతం ఒక కెప్టెన్ గా అవతరించాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ఇప్పుడు ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోనీ రికార్డు మాత్రం ఇప్పటికే భారత కెప్టెన్లలో సాధించలేకపోయారు అనే చెప్పాలి. ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ధోనీ క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది. కానీ ఎక్కడా తగ్గడం లేదు. ఇకపోతే ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు దూరం అయినప్పటికీ బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.



 ఇక అటు భారత క్రికెట్లో 3 వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్గా కొనసాగడమే కాదు..  ఐపీఎల్ లో కూడా నాలుగు సార్లు టైటిల్ గెలిపించిన కెప్టెన్గా కూడా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. అయితే మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే దానికి కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే వుంటుంది. ధోనికి అభిమానులు ఉంటారు అని చెప్పడం కంటే వీరాభిమానులు ఎక్కువ అని చెప్పాలి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ కూడా ధోని.. ఆటకి, మిస్టర్ కూల్ కెప్టెన్సికి అభిమానులుగా మారిపోయారు  ఎంతోమంది. ఇక ఇటీవల తాను కూడా మహేంద్ర సింగ్ ధోనీ అభిమానిని అని చెబుతున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి  ఎంకే స్టాలిన్.


 ఇటీవలే చెన్నైలో ఐపీఎల్ 2021 టైటిల్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో జట్టు ఆటగాళ్లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే ఇక ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల కురిపించారు. ఇక టైటిల్ గెలిచిన కెప్టెన్ ధోనీ సహా ఇతర ప్లేయర్లందరికి కూడా అభినందించారు. రాబోయే చాలా సీజన్లలో ధోని చెన్నై జట్టుకు సారథ్యం వహించాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఎంకే స్టాలిన్. తాను ఇక్కడికి తమిళనాడు ముఖ్యమంత్రిగా రాలేదని ధోని అభిమానిగా వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఒక్క మాటతో ధోని అభిమానుల మనసులు గెలుచుకున్నారు ఎంకే స్టాలిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: