న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌ లో రోహిత్ శర్మ వరుసగా మూడోసారి టాస్ గెలిచి కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్‌లోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టీ 20 లలో మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత్ మ్యాచ్‌ లను గెలవడానికి చాలా కష్టపడింది. అయితే ఇదే ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ 2021 నుండి సూపర్ 12 దశలో పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్‌ తో ఓడిపోయి... భారత ముందస్తు నిష్క్రమణకు దారితీసింది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ మరియు ఓపెనింగ్ పార్టనర్ ఇషాన్ కిషన్ ఆతిథ్య జట్టుకు మంచి ప్రారంభాన్ని అందించారు. వారు న్యూజిలాండ్ పేస్ అటాక్‌పై బాగా దాడి చేసారు.

రోహిత్, కిషన్ ఇష్టానుసారంగా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో భారత్ 69 పరుగులు చేయగలిగింది. అయితే మొదటి ఆరు ఓవర్ల తర్వాత కిషన్ 19 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్‌ గా ఉండగా, అతని కెప్టెన్ 17 బంతుల్లో 39 పరుగులు చేశాడు. పవర్‌ప్లే లో రోహిత్ మూడు భారీ సిక్సర్లు కొట్టాడు మరియు వాటిలో చివరిది అతనిని టీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌ లలో 150 సిక్సర్ల మైలురాయికి చేర్చింది. అయితే ఈ జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 161 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్‌ కు వచ్చినప్పుడు అతని దీనికి మరిన్ని జోడించవచ్చు. అయితే 150 సిక్సర్ల మార్క్‌ను దాటిన రెండో బ్యాట్స్‌మెన్‌ గా రోహిత్ నిలిచాడు. ఇక వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ 124 సిక్స్ లతో ర్ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఈ జాబితాలో 91 సిక్సర్లతో చాలా దూరంలో ఉన్న విరాట్ కోహ్లి 11 వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మాస్క్ లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్‌నర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మరియు రిషబ్ పంత్‌ల వికెట్లను త్వరగా తీయడంతో భారత్ స్కోర్ బోర్డు నెమ్మదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: