ఈ రోజు భారత జట్టు న్యూజిలాండ్ జట్ల మధ్య టి 20 సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు ఓపెనర్లు. మొదటి వికెట్ కు 69 పరుగులు జోడించిన తర్వాత.. ఓపెనర్ ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 29 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 4 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా డక్ అవుట్ కాగా.... ఆ వెంటనే రిషబ్ పంత్ ఆరు బంతుల్లో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అయితే ఓపెనర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అర్థ శతకం పూర్తి చేసాడు. 31 బంతుల్లో 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ 20 బంతుల్లో 25 పరుగులు చేయగా... వెంకటేష్ అయ్యర్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అయితే చివర్లో హర్షల్ పటేల్ 11 బంతుల్లో 18 పరుగులు.. దీపక్ చాహర్ 8 బంతుల్లో 21 పరుగులతో రెచ్చిపోవడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగలిగింది.

ఇక న్యూజిలాండ్ బౌలర్లను ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా ఉన్న మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు తీయగా... లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే ఒక్కో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నారు అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 105 పరుగులు చేయాలి కానీ భారత బౌలింగ్ ఎదుర్కొని ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమైన పని .అయితే చూడాలి మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుందా.. లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: