బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కారణంగా టీమిండియాకు ఎంతోమంది ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లు దొరుకుతున్నారు అని చెప్పాలి. ఇప్పటివరకు ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ లో సత్తా చాటి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న వారు ఉన్నారు. అయితే ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టి20 సిరీస్ లో కూడా ఐపీఎల్లో స్టార్ ప్లేయర్ గా వెలిగిన వారు చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇక యువ ఆటగాళ్లు అందరూ కూడా ఎంతగానో రాటుదేలుతున్నారు అనే చెప్పాలి. అయితే  ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన వారు అటు అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం కాస్త తడబడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇక అరంగేట్రం చేసిన కొన్ని మ్యాచ్లలో చెత్త రికార్డును తమ ఖాతలో వేసుకోవడం కూడా చేస్తుంటారు. ఒత్తిడితో  చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు ఎంతో మంది యువ ఆటగాళ్లు. ఇక ఇప్పుడు ఐపీఎల్లో స్టార్ ప్లేయర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించిన హర్షల్ పటేల్ ఇక ఇటీవల జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక చెత్త రికార్డు ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా మాత్రమే కాకుండా అవసరమైనప్పుడు బ్యాట్ తో కూడా రాణించాడు హర్షల్ పటేల్.



 కానీ ఇటీవలి అంతర్జాతీయ క్రికెట్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో అంతర్జాతీయ టీ20 లోకి ఆరంగేట్రం చేసి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడవ టీ20 మ్యాచ్ లో హిట్ వికెట్గా హర్షల్ పటేల్ వెనుదిరిగాడు.  మొదట్లో పరుగులు చేస్తున్నట్లు కనిపించినప్పటికీ ఒక చెత్త షార్ట్ ఆడబోయి చివరికి వికెట్లను కొట్టుకున్నాడు హర్షల్ పటేల్. హిట్ వికెట్ గా నిలిచిన రెండో ఆటగాడిగా చెత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతకుముందు 2018లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కె.ఎల్.రాహుల్ హిట్ వికెట్గా పెవిలియన్ చేరడం గమనార్హం. భారత్ తరఫున ఈ చెత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ ఇద్దరు ఆటగాళ్లే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: