ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఆటకి ఫిదా అవ్వని క్రికెట్ ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు చేయాలి అనే లక్ష్యంతో మైదానంలోకి వచ్చి హార్దిక్ పాండ్యా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇక ప్రతి బంతిని కూడా బౌండరీ దాటించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ సరిగ్గా సరిపోతుంది అని చెప్పాలి. చూడటానికి బక్క పలచగా ఉండే హార్దిక్ పాండ్యా కొట్టె సిక్స్ లు మాత్రంభారీ రేంజ్ లోనే ఉంటాయి.


 అయితే కేవలం బ్యాటింగ్తో మాత్రమే కాదు తన బౌలింగ్ కూడా ఎన్నోసార్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి విజయాలు అందించాడు హార్దిక్ పాండ్యా. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం హార్థిక్ పాండ్యా కెరియర్ ప్రశ్నార్థకం గా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు బంతితో బ్యాట్ తో అదరగొట్టిన  హార్దిక్ పాండ్య .. ఇటీవలి కాలంలో కేవలం బ్యాటింగ్ మాత్రమే పరిమితం అయ్యాడు అని చెప్పాలి. భుజం గాయం కారణంగా బౌలింగ్ కు దూరమైన హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు మరోసారి బౌలింగ్ పై దృష్టి పెట్టలేకపోయాడు. టి20 వరల్డ్ కప్ లో అయినా సరే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడు  అని అనుకున్నప్పటికీ అది కుదరలేదు.


 అదే సమయంలో అటు బ్యాటింగ్ లో కూడా పెద్దగా రాణించలేదు హార్దిక్ పాండ్యా. ఇలాంటి నేపథ్యంలో ఇక హార్దిక్ పాండ్యా కెరీర్ ప్రస్తుతం రోజురోజుకీ ప్రమాదంలో పడిపోతుంది. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోతు ఉండడంతో ఫిట్నెస్ నిరూపించుకోవాలి అంటూ ఇటీవల బీసీసీఐ సూచించింది. అయితే హార్దిక్ పాండ్య మునుపటి ఫామ్ చూపించలేకపోతు ఉండడంతో ఇక హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ స్థానాన్ని మరో యువ ఆటగాడితో  భర్తీ చేయాలని బిసిసిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల జట్టులో అవకాశం దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్ ను పర్మినెంట్ ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలని భావిస్తున్నారట. ఇక ఇదే జరిగితే హార్దిక్ పాండ్య కెరియర్   పూర్తిగా ప్రమాదంలో పడిపోయినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: