ఇటీవలే టి20 వరల్డ్ కప్ ముగియగానే న్యూజిలాండ్ జట్టుతో వరుసగా టి20 టెస్టు సిరీస్ లు ఆడేందుకు సిద్ధమైంది టీమిండియా. అయితే దీనికోసం ఇప్పటికే బీసీసీఐ షెడ్యూలు కూడా విడుదల చేసింది. అయితే ఇప్పటికే టి20 సిరీస్ ముగియగా టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ఇక మరికొన్ని రోజుల్లో టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతోంది.. అయితే టీమిండియాలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు హనుమ విహారి. ఎన్నోసార్లు టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో తన బ్యాటింగ్ నైపుణ్యంతో అదరగొట్టి విజయాన్ని అందించాడు. గత కొంతకాలం నుంచి మంచి ఫామ్ లో నే కొనసాగుతున్నాడు హనుమ విహారి.


 ఇలా మంచి ఫాంలో కొనసాగుతున్న హనుమ విహారిని ఇక న్యూజిలాండ్తో ఆడబోయే టెస్ట్ సిరీస్ జట్టులో స్థానం దక్కుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బీసీసీఐ సెలెక్టర్స్ టీమిండియా జట్టులో హనుమ విహారిని ఎంపిక చేయలేదు.  కానీ టీమ్ ఇండియా ఏ జట్టు తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేశారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. న్యూజిలాండ్తో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం హనుమ విహారి ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ సెలెక్టర్లను ప్రశ్నించాడు.


 ఇటీవలే ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన అజయ్ జడేజా సెలక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హనుమ విహారి ని తలచుకుంటే ఎంతగానో బాధ కలుగుతుంది. కొంతకాలంగా టీమిండియాతో పర్యటిస్తున్న హనుమ విహారి అవకాశం వచ్చినప్పుడల్లా బాగా రాణిస్తున్నాడు. అసలు హనుమ విహారి ఏం తప్పు చేశాడు. ఇండియా ఏ జట్టు తరఫున ఎందుకు వెళ్లాలి.. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో ఎందుకు ఆడకూడదు అంటూ ప్రశ్నించారు అజయ్ జడేజా. ఇన్ని రోజుల వరకు జట్టుతో కలిసి ఆడిన ఆట గాడు ఇక ఇప్పుడు ఇండియా ఏ జట్టుతో కలిసి ఆడుతుంటే. మరోవైపు ఇక టీమిండియా టెస్టు జట్టులో యువ ఆటగాళ్లు వచ్చి ఆడుతూ ఉండడం  అందరినీ గందరగోళానికి గురి చేస్తాయి అంటూ అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు. అయితే అటు హనుమ విహారిని న్యూజిలాండ్తో ఆడబోయే టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: