ఇలా మంచి ఫాంలో కొనసాగుతున్న హనుమ విహారిని ఇక న్యూజిలాండ్తో ఆడబోయే టెస్ట్ సిరీస్ జట్టులో స్థానం దక్కుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బీసీసీఐ సెలెక్టర్స్ టీమిండియా జట్టులో హనుమ విహారిని ఎంపిక చేయలేదు. కానీ టీమ్ ఇండియా ఏ జట్టు తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేశారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. న్యూజిలాండ్తో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం హనుమ విహారి ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ సెలెక్టర్లను ప్రశ్నించాడు.
ఇటీవలే ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన అజయ్ జడేజా సెలక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హనుమ విహారి ని తలచుకుంటే ఎంతగానో బాధ కలుగుతుంది. కొంతకాలంగా టీమిండియాతో పర్యటిస్తున్న హనుమ విహారి అవకాశం వచ్చినప్పుడల్లా బాగా రాణిస్తున్నాడు. అసలు హనుమ విహారి ఏం తప్పు చేశాడు. ఇండియా ఏ జట్టు తరఫున ఎందుకు వెళ్లాలి.. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో ఎందుకు ఆడకూడదు అంటూ ప్రశ్నించారు అజయ్ జడేజా. ఇన్ని రోజుల వరకు జట్టుతో కలిసి ఆడిన ఆట గాడు ఇక ఇప్పుడు ఇండియా ఏ జట్టుతో కలిసి ఆడుతుంటే. మరోవైపు ఇక టీమిండియా టెస్టు జట్టులో యువ ఆటగాళ్లు వచ్చి ఆడుతూ ఉండడం అందరినీ గందరగోళానికి గురి చేస్తాయి అంటూ అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు. అయితే అటు హనుమ విహారిని న్యూజిలాండ్తో ఆడబోయే టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.