2019లో బంగ్లాదేశ్‌ పై స్వదేశంలో జరిగిన భారతదేశం యొక్క మొదటి పింక్-బాల్ టెస్టులో ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయంలో ప్రధాన పాత్రధారులు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ మరియు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసిన ఇషాంత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోగా, నవంబర్ 23న మ్యాచ్ రెండో రోజు తన 70 అంతర్జాతీయ సెంచరీ చేసాడు విరాట్ కోహ్లీ. దాంతో ఈ మార్క్ అందుకున్న మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. యాదృచ్ఛికంగా, అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ మూడు అంకెల స్కోరు నమోదు చేయడం కూడా ఇదే చివరిసారి. అతను ఈడెన్ గార్డెన్స్‌లో 194 బంతుల్లో 136 పరుగులు చేసి, తైజుల్ ఇస్లాం ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ను ఎబాదత్ హుస్సేన్‌కి పడేసాడు. ఈ ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు బాదిన కోహ్లి 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 71వ ఓవర్‌లో అబూ జాయెద్‌ను వరుసగా నాలుగు బౌండరీలు కొట్టడం ద్వారా కోహ్లి మూడు అంకెల మార్కును దాటిన తర్వాత ఇన్నింగ్స్‌లో గేర్లు మార్చి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

33 ఏళ్ల కోహ్లీ మరుసటి నెలలో హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 94 పరుగులు చేయడం ద్వారా సెంచరీ చేయని టీ 20 ఫార్మాట్ లో... మరో ఇంటర్నేషనల్‌లో సెంచరీని స్కోర్ చేయడానికి దగ్గరగా వచ్చాడు. కానీ అది పూర్తి కాలేదు. ఆ తర్వాత వన్డేలలో, కోహ్లీ జనవరి 2020లో బెంగళూరులో మరియు నవంబర్ 2020లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై రెండుసార్లు 89 పరుగులు చేశాడు. కానీ సెంచరీ చేయలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి కంటే రికీ పాంటింగ్ (71), సచిన్ టెండూల్కర్ (100) మాత్రమే ఎక్కువ సెంచరీలు సాధించారు. చురుకైన అంతర్జాతీయ క్రికెటర్లలో. కోహ్లి దీర్ఘకాల సహచరుడు రోహిత్ శర్మ 41 సెంచరీలు చేసి... ఈ జాబితాలో 14వ స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: