సాధారణంగా క్రికెట్లో ఆటగాళ్లు ఎప్పుడూ ఎంతో ఫిట్ గా ఉండటానికి ఆరోగ్యంగా ఉండడానికి ఒక ప్రత్యేకమైన డైట్ ప్లాన్ పాటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ ఆటగాళ్లు అందరికీ కూడా ప్రత్యేకమైన ఆహారాన్నిఅందిస్తూ ఉంటుంది బిసిసిఐ. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు ఎప్పుడూ డైట్ ప్లాన్ అందుబాటులో  ఉంటాయి. అయితే ఇటీవల ఆహారం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త డైట్ ప్లాన్ ను బీసీసీఐ అమలు లోకి తీసుకు వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ కొత్త డైట్ ప్లాన్ ప్రకారం అటు ఆటగాళ్లు ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కొన్ని రకాల ఆహారాలు జోలికి మాత్రం అస్సలు పోవద్దు అంటూ బిసిసిఐ ఖరాఖండీగా చెప్పడం గమనార్హం.



 ఒకప్పుడు బీసీసీఐ ఆటగాళ్ల ఫుడ్ మెనూ లో పంది మాంసం ఎద్దు మాంసం లాంటివి కూడా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి వాటిని ఫుడ్ మెనూ నుంచి  తొలగిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవలే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కొంతమంది క్రికెట్ ఆటగాళ్ళ కి షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొత్త డైట్ ప్లాన్ ప్రకారం టీమిండియా ఆటగాళ్లు ఎవరు కూడా పంది మాంసం ఎద్దు మాంసం తినకూడదు అంటూ ఇటీవలే ఆంక్షలు విధించి నట్లు తెలుస్తోంది. హలాల్ చేసిన మాంసం తినడానికి మాత్రమే ఆటగాళ్లను అనుమతిస్తున్నట్లు ఫ్రీ ప్రెస్ జనరల్ తెలిపింది.



 భారత ఆటగాళ్లందరూ మరింత ఫిట్గా ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే హలల్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి అంటూ బిసిసిఐ నిబంధన అమలులోకి తీసుకు రావడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. బిసిసిఐ లాంటి నిబంధన తెరమీదకు తీసుకురావడం ఏంటి అనీ అంటూ అందరూ తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక రానున్నఇక ఈ కొత్త డైట్ ప్లాన్ విషయంలో బిసిసిఐ ఏమైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయ్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: