ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్ లు జరుగుతున్నా... ఇండియాలో ప్రతి సంవత్సరం మార్చి నుండి మే నెల వరకు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఎంత ఫేమస్ అనేది తెల్సిందే. ప్రపంచంలోని ఆటగాళ్లు అంతా ఇందులో ఒక్కసారైనా ఆడాలి అని కలలు కన్నవారున్నారు. వాటిని నిజం చేసుకుని తమ ఫేవరెట్ ప్లేయర్స్ తో డ్రెస్సింగ్ రూమ్స్ ను షేర్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఏడాది ఏడాదికి ఐపీఎల్ క్రేజ్ మరింతగా పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. దీనితో ప్రతి సంవత్సరం ప్రేక్షకులను సంతోష పెట్టడానికి ఐపీఎల్ పాలక మండలి కొత్త కొత్త వ్యూహాలను మాలు చేస్తోంది. దీనికి తోడు ఈ సారి నుండి ఐపీఎల్ లో టైటిల్ కోసం 10 జట్లు పోటీ పడనున్నాయి.

ఇదిలా ఉంటే... ఐపీఎల్ సీజన్ 15 కు ముందు భారీ వేలం జరగనుంది. అది బహుశా జనవరి లో ఉండనుంది అని అనుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సొంత జట్లకు ఆడుతున్న ఎంతోమంది ఆటగాళ్లు ఈ వేలంలో అందరి దృష్టిలో పడనున్నారు. అయితే ఆటగాళ్ల ఫామ్ ను బట్టి చూస్తే కొందరు సీనియర్ ప్లేయర్ లకు ఉద్వాసన తప్పేలా లేదు. వీరికన్నా రెట్టింపు ఆటతో యువకులు ముందుకు దూసుకువస్తున్నారు. కాబట్టి రాబోయే వేలంలో కుర్రాళ్లను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు ఎక్కువగా ఆసక్తి చూపనున్నారు అన్నది తెలిసిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా టీ 20 లీగ్ లు జరుగుతుండడంతో అందరూ దూకుడైన ఆటకు అలవాటు పడిపోయారు. దీనిని బట్టి అనుభవమున్న సీనియర్ ఆటగాళ్ల కన్నా యువకుల మీదనే ఫ్రాంచైజీల దృష్టి ఉంటుందని సమాచారం. మరి చూద్దాం ఈ సారి ఎవరెవరు ఎన్ని కోట్లకు అమ్ముడు కానున్నారో. యితే ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు తమకు కావలసిన ఆటగాళ్లను లిస్ట్ చేసుకుంటున్నట్లు క్రీడా వర్గాల సమాచారం.  
మరింత సమాచారం తెలుసుకోండి: