అయితే ఇటీవలే ఐపిఎల్ 2021 సీజన్ ముగిసింది. ఇక పోతే ఇక 2022 ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉండటం గమనార్హం. అదే సమయంలో 2022 ఐపీఎల్ సీజన్ లో కొత్తగా రెండు జట్లు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ ఐపీఎల్ కోసం మేగా వేల నిర్వహించబోతోంది. దీంతో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళిపోతున్నాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో యూఏఈ వేదికగా కాకుండా ఎప్పటిలా భారత్ వేదికగానే ఐపీఎల్ నిర్వహించాలని బిసిసిఐ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇక 2022 ఐపీఎల్ సీజన్ భారత్ వేదికగా జరగబోతుంది. దీంతోఐపీఎల్ 2022 మ్యాచ్ చెపాక్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 2, 2022న ప్రారంభం కాబోతోందని టాక్ వినిపిస్తోంది. 60 రోజులపాటు ఈ టోర్నీ జరగబోతుంది. ఇక 10 జట్లు 74 మ్యాచ్ ఆడబోతున్నాయట. ఐపీఎల్ ఫైనల్ జూన్ 4వ తేదీన లేదా 5వ తేదీన జరగబోతుందట. టోర్ని ఓపెనింగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగబోతుందట.