ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకూ ఐపీఎల్ లో కేవలం 8  సీట్లు మాత్రమే తలపడ్డాయి కానీ ఇప్పుడు కొత్తగా మరో రెండు జట్లు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయ్. దీంతో ఇక అటు జట్ల మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారబోతోంది. అదే సమయంలో మొన్నటి వరకు ఏ ఆటగాడు ఏ జట్టులో ఉన్నాడు అన్న విషయం అందరికీ క్లారిటీ ఉంది. దీంతో జట్టు ప్రదర్శనపై కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి ముందు మెగా వేలం నిర్వహించాలని నిర్ణయించింది బీసీసీఐ.


దీంతో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళి పోతాడు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. కాగా ఈ మెగా వేలం కోసం అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం ఐపీఎల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు అన్నదానిపై మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.. అదే సమయంలో ఎబి డివిలియర్స్ పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో కొత్త కెప్టెన్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఒక జట్టు నలుగురు ఆటగాళ్లు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.


 దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎవరిని రిటైన్ చేసుకోబోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై క్రికెట్ కామెంటేటర్ భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందించాడు. మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ,యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడికల్ తో పాటు హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్ లలో ఒకరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక మిగతా  ఆటగాళ్లను మెగా వేలంలో కి వదిలి పెట్టే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb