టీమిండియా జట్టులో గుర్తింపు పొందిన యువ ఆటగాడు గా కొనసాగుతున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇన్ని రోజుల నుంచి అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ ప్రస్తుతం టీమిండియా క్రికెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే సాధారణం గా ఇక క్రికెట్ లో ఉన్న అన్ని ఫార్మాట్ల  లో కూడా సత్తా చాటాలి అని ప్రతి ఒక క్రీడాకారుడు భావిస్తూ ఉంటారు. కానీ కొంతమందికి అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు అవకాశం దొరికినప్పటికీ  కేవలం ఒక ఫార్మేట్ కు మాత్రమే కొంత మంది ఆటగాళ్ళు పరిమితం అవుతుంటారు.



 అయితే ఒక ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ప్పటికీ ఇక మరో ఫార్మాట్ లోకి అడుగు పెట్టడానికి మాత్రం కొన్ని సంవత్సరాల సమయం కూడా పడుతూ ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్ల విషయంలో ఇది నిజం అయింది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ విషయం లో కూడా ఇది నిజమైంది. టీమిండియా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు శ్రేయస్ అయ్యర్. T20, వన్డే మ్యాచ్ లలో కూడా నిలకడగా రాణిస్తూ ఉన్నాడు. ఐపీఎల్లో మొన్నటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు శ్రేయస్ అయ్యర్.


 కానీ ఇప్పటివరకూ అంతర్జాతీయ టెస్టు ఫార్మాట్లో మాత్రం శ్రేయస్ అయ్యర్ అవకాశం దక్కించుకో లేక పోయాడు అని చెప్పాలి. కానీ ఇక ఇటీవలే మొదటి సారి టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్తో రేపటి నుంచి టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లు ఆడుతుంది. ఇక రేపటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్ టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నాడని తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ గా ఉన్న అజింక్యా రహానే స్పష్టం చేశాడు.  ఇప్పటివరకు భారత్ తరఫున ఇరవై రెండు వన్డేలు, 32 టి20 లు ఆడిన శ్రేయస్ అయ్యర్  ఇప్పుడు టెస్ట్ ప్లేయర్గా  కూడా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: