భారత్ క్రికెట్ చరిత్రలో ఎందరో అద్భుతమైన క్రికెటర్లు ఇండియన్ క్రికెట్ కు తమ సేవలను అందించి ప్రెకషకుల మదిలో చెరగని ముద్ర వేశారు. 15 సంవత్సరాల క్రితం వరకు టెస్ట్ మ్యాచ్ లకు మంచి ఆదరణ వుండేది. అయితే రాను రాను టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లను చూసే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీనికి కారణం లెక్కకు మించి వివిధ రకాల పొట్టి క్రికెట్ లీగ్ లు పుట్టుకు వస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు ప్రేక్షకులు టెస్ట్ మ్యాచ్ లను స్టేడియాలకు వచ్చి చూస్తున్నారంటే కొందరు అద్భుతమైన ప్లేయర్ ల ఆటను కళ్లారా చూడడానికి మాత్రమే. అటువంటి ప్లేయర్స్ లో భారత్ నుండి ఒకప్పుడు సచిన్, గంగూలీ, ద్రావిడ్ మరియు ధోనీ లు దగ్గర నుండి ఇప్పుడు భారత్ క్రికెట్ కు సేవలు అందిస్తున్న కోహ్లీ, రోహిత్, పుజారా, రహానే లాంటి వారి వరకు ఎందరో ఉన్నారు.

టెస్ట్ లు అంటే ముఖ్యంగా బౌలర్ ఎంతటి వాడైనా అవుట్ కాకుండా గంటల తరబడి క్రీజులో పాతుకుపోవాల్సిందే. ఇప్పుడున్న వారిలో ఛతేశ్వర్ పుజారా ముందు వరుసలో ఉంటాడు. పరుగులు చేయకుండా గంటల కొద్దీ బౌలర్లను విసిగిస్తూ ఉంటాడు. ఇతని టెస్ట్ కెరీర్ లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. టీం కష్టాల్లో ఉన్నపుడు ఆదుకుని జట్టును ఓటమి కోరల నుండి తప్పించిన సందర్భాలు, అలాగే జట్టును ఓటమి నుండి విజయ తీరాలకు చేర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ తర్వాత అంతటి పేరు వచ్చింది పుజారాకు అని చెప్పాలి.

కానీ తన కెరీర్ లో ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాడు. దాదాపు మూడు సంవత్సరాలుగా కనీసం సెంచరీ చేయలేక ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గతంలో 2019 వ సంవత్సరం జనవరి నెలలో ఆస్ట్రేలియాతో సిడ్నీ లో చేసిన 193 పరుగులే ఆఖరి సెంచరీ కావడం విశేషం. మరి రేపు న్యూజిలాండ్ తో జరగనున్న మొదటి టెస్ట్ లో అయినా సెంచరీ సాధించి మూడేళ్ళుగా తనకు అందని ద్రాక్షలా ఉన్న సెంచరీ మార్కును అందుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: