రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ -  న్యూజిలాండ్ మధ్య 1వ టెస్టు ఈరోజు నుంచి కాన్పూర్‌ లోని గ్రీన్ పార్క్‌లో తలపడుతున్నాయి. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్ ఇండియాకు ఇది తొలి టెస్టు. ఇక రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్లు జస్ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ షమీ మరియు వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ వంటి వారు జట్టులో లేరు. ముంబైలో జరిగే రెండో టెస్టులో కోహ్లి జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, తొలి టెస్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రహానే మూడు టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు, అక్కడ అతని యువ బ్రిగేడ్ టిమ్ పైన్ నేతృత్వంలోని జట్టును వరుసగా రెండోసారి ఓడించింది. ఇక అదే విశ్వసంతో రహానే కివీస్ ను కూడా ఓడిస్తారు అనే నమ్మకం మీద ఉన్నారు. అయితే ఈ మొదటి టెస్ట్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకొని కివీస్ జట్టును మొదట బౌలింగ్ కు పంపిస్తున్నారు. అయితే టీ20 సిరీస్ లో విశ్రాంతి తీసుకున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ లో ఆడుతూ... జట్టుకు న్యాయకత్వం వహిస్తున్నాడు. అయితే పంచ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ట్రోఫీ కోసం జరిగిన ఫైనల్స్ లో ఈ రెండు జట్లు చివరిసారిగా టెస్ట్ మ్యాచ్‌లో తలపడిన విషయం తెలిసిందే.

భారత జట్టు : శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే(c), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(wk), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్

కివీస్ జట్టు : టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(c), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(wk), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జేమీసన్, విలియం సోమర్‌విల్లే

మరింత సమాచారం తెలుసుకోండి: