మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా మెగా వేలం షురూ  కాబోతుంది. దీంతో ఇక ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరి చూపు కూడా ఈ మెగా వేలం పైనే ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏ ఆటగాడు ఏ జట్టులో చేరతాడు.. ఆటగాడిని ఎంత వెచ్చించి జట్లు కొనుగోలు చేస్తాయి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో పాటు అటు జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. ప్రస్తుతం చాలా జట్లు ఏకంగా కెప్టెన్గా ఉన్న ఆటగాళ్లను సైతం వదిలేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే గత కొంత కాలం నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు సంజూ శాంసన్ .


 అయితే సంజూ శాంసన్ కెప్టెన్సీలో కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అదృష్టం కలిసి రావడం లేదు అని చెప్పాలి. ఒకవైపు సంజు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతనికి మిగతా ఆటగాళ్లు నుంచి మాత్రం సరైన మద్దతు లభించడం లేదనే చెప్పాలి. దీంతోవరుస ఓటములు చవి చూస్తూ ఎప్పుడూ పాయింట్ల పట్టికలో చిట్టచివర నిలుస్తూ వస్తుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు మెగా వేలం నిర్వహిస్తుండడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శాంసన్ వేలం లోకి వదిలేసే  అవకాశంఉందని ఇక అతని స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకునే అవకాశం ఉందని అందరూ భావించారు.




 కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కెప్టెన్ సంజూ శాంసన్ ను రిటైన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. ఏకంగా 14 కోట్ల డీల్ తో సంజు ను రాజస్థాన్ రాయల్స్ అంటిపెట్టుకొపోతుందట. ఈ క్రమంలోనే ఇక రానున్న ఐపీఎల్ సీజన్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా అతడే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.. ఇక సంజూ శాంసన్ తో పాటు బట్లర్, లివింగ్ స్టోన్, జైస్వాల్ లలో ముగ్గురిని రిటైన్ చేసుకోబోతుందట రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం.. అటు మిగితా జట్లు కూడా రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల వివరాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: