ఐపీఎల్ ఎంటర్ టైన్ మెంట్ ను మరింత రసవత్తరంగా మార్చేందుకు బిసిసిఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే 2022 ఐపీఎల్ సీజన్  మోసం కొత్తగా రెండు జట్లను  కూడా తీసుకు వచ్చేందుకు సిద్ధమయింది బీసీసీఐ . ప్రస్తుతం దీనికి సంబంధించిన అన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. ఐపీఎల్ 2 కొత్త జట్లు వస్తున్న నేపథ్యంలో త్వరలో మెగా వేలం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది బి సిసీఐ. దీంతో ఇక ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తాడు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక మెగా వేలం కి ముందు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ప్రతి జట్టుకు కల్పించింది బీసీసీఐ .


 ఇలా రిటైన్ చేసుకునే ఆటగాళ్ల వివరాలను వెల్లడించాలని అంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జట్టులో ఉన్న కీలకమైన నాలుగురు ఆటగాళ్లను తమతోనే అంటిపెట్టుకునేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలను కూడా పొందుపరిచి బిసిసిఐకి సమర్పించపోతున్నాయి అన్నది తెలుస్తుంది. అయితే ఇలా రిటైన్ చేసుకోవడం విషయంలో అటు పంజాబ్ జట్టు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉండగా పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ఒక్క ఆటగాడిని కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదట.


 ఇప్పటికే టీ-20 ఫార్మెట్లో అద్భుతం గా రాణిస్తున్న కెప్టెన్ రాహుల్ ను సైతం వదులుకునేందుకు సిద్ధమైంది అనే టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు అసలు ఎవరిని కూడా రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదట ఆ జట్టు యాజమాన్యం. తమ జట్టులో రిటైన్ చేసుకోదగ్గ ఆటగాళ్లు ఎవరూ లేరని భావిస్తోందట. దీంతో జట్టులోని ఆటగాళ్లు అందర్నీ కూడా మెగా వేలంలోకి వదిలివేసి మెగా వేలంలోఎంతో మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి కొత్తగా జట్టును నిర్మించుకోవాలని పంజాబ్ కింగ్స్ జట్టు భావిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: