ఇటీవలే టి20 వరల్డ్ కప్ మిగియగానే న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. భారత పర్యటనలో భాగంగా టీ20 టెస్ట్ సిరీస్ ఆడుతుంది న్యూజిలాండ్ జట్టు. ఈ క్రమంలో ఇప్పటికే భారత్ న్యూజిలాండ్ మధ్య  టీ 20 సిరిస్ ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించింది భారత జట్టు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. స్వదేశీ గడ్డపై ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును క్లీన్స్వీప్ చేసింది భారత జట్టు .





ఇక ప్రస్తుతం కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతుంది భారత జట్టు.ఈ క్రమంలోనే న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కాస్త ఎంతో రసవత్తరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే న్యూజిలాండ్తో ఆడుతున్న టెస్టు సిరీస్లో అంతర్జాతీయ టెస్టు ఫార్మాట్లో లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. ఎన్నో రోజుల వరకూ వన్డే టి20 ఫార్మాట్లో టీమిండియాలో కీలక ఆటగాడిగా నిలకడగా రాణించిన శ్రేయస్ అయ్యర్ టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఇప్పటివరకు అడుగు పెట్టక పోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల లేటెస్ట్ ఫార్మాట్ లోకి అడుగుపెట్టిన శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు.


 ఏకంగా మొదటి టెస్ట్ లోనే సెంచరీతో అదరగొట్టాడు శ్రేయస్ అయ్యర్. అయితే తమ అభిమాన ఆటగాడు మైదానంలో రాణిస్తూ ఉంటే ఇక స్టేడియం లో ఉన్న ప్రేక్షకులు వింతైన నినాదాలతో హోరెత్తిన పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే..  ఈ క్రమంలోనే అటు శ్రేయస్ అయ్యర్ సెంచరీ కొట్టగానే అతని ఎంకరేజ్ చేస్తూ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు చేసిన నినాదాలు కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయ్.దస్ రూపాయాకా పెప్సీ..  అయ్యర్ బాయ్ సెక్సీ అంటూ నినాదాలు చేశారు అభిమానులు. ఇక దీనికి సంబంధించిన వీడియో
 ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో 171 బంతుల్లో 105 రన్స్ చేశాడు అయ్యర్.

మరింత సమాచారం తెలుసుకోండి: