సాధారణంగా భారత అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ఎంతో మంది యువ ఆటగాళ్లు ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇలా భారత జట్టులో స్థానం సంపాదించుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వినియోగించుకుంటారు. మరికొంతమంది అదృష్టం కలిసి వచ్చి భారత జట్టులో స్థానం సంపాదించుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే అటు భారత జట్టులో టీ20 వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్న ఇప్పటికీ టెస్టు జట్టులో స్థానం సంపాదించుకోవడానికి మాత్రం ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆటగాళ్లు.


 ఎందుకంటే టెస్టు ఫార్మాట్లో ఆటగాళ్ల ప్రతిభను నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది.. టెస్టు జట్టులో స్థానం దక్కించుకుని తమ సత్తా ఏంటో  అందరికీ తెలియచేయాలి అని భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే భారత జట్టు తరపున వన్డే టి20 ఫార్మాట్లో అడుగుపెట్టిన శ్రేయస్ అయ్యర్ నిలకడ గల ఆటగాడిగా ఎంతగానో పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే కొన్ని సంవత్సరాల తర్వాత టెస్ట్ ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. దీంతో ఇక టెస్టు ఫార్మాట్లో శ్రేయస్ అయ్యర్ కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.


 ఈ క్రమంలోనే ఇటీవల టెస్టుల్లో కి  అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ తనదైన శైలిలో సత్తా చాటాడు. ఏకంగా తొలి టెస్టులోనే సెంచరీ చేసి అదరగొట్టాడు శ్రేయస్ అయ్యర్.. దీంతో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ పై అభిమానులు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మొదటి టెస్టులో సెంచరీ కొట్టిన శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో సెంచరీ కొట్టడంతో తన గురువును డిన్నర్ కి ఆహ్వానిస్తాను అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ముంబైలో నా కోచ్ ప్రవీణ్ ఆమ్రే జీవితంలో నీ లక్ష్యం టీమిండియాకు ఆడటమే అంటూ చెప్పాడు. టెస్టుల్లో సెంచరీ చేసినప్పుడే నీతో కలిసి నేను డిన్నర్ చేస్తాను అంటూ నాకు చెప్పాడు. ఇక ప్రస్తుతం నేను టెస్టులో సెంచరీ చేశా.. ఇకఇప్పుడు నాకు గురువుని డిన్నర్కి ఆహ్వానిస్తాను అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: