కాన్పూర్ వేదికగా ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట ఇన్నింగ్స్ లో ఇండియా 345 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మొదటి టెస్ట్ ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ సెంచరీ సాధించి రికార్డు సాధించాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ జట్టు ఆచితూచి ఆడుతూ భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తోంది. మొదటి వికెట్ కు ఓపెనర్లు టామ్ లాథం మరియు విల్ యంగ్ లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి కివీస్ కు మంచి ఓపెనింగ్ ను అందించారు. ప్రస్తుతం నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.

మరో వైపు భాగస్వాములను కోల్పోతున్నా పట్టు విడవకుండా టామ్ పోరాడుతూనే ఉన్నాడు. ఇది మూడవ రోజు కావడంతో ఫలితం తేలాలంటే ఇంకా రెండు ఇన్నింగ్స్ లు ఆడాల్సి ఉంది. అయితే న్యూజిలాండ్ ఇంకా 100 పరుగులు వెనుకబడి ఉంది. కనీసం 50 పరుగులకు పైన ఆధిక్యం సాధిస్తే ఇండియా పట్టు బిగించే అవకాశం ఉంటుంది. దీనికోసం వీలైనంత తొందరగా కివీస్ ను ఆల్ అవుట్ చెయ్యాలి. ముఖ్యంగా ఫామ్ లో ఉన్న టామ్ ను అవుట్ చేస్తే మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చినట్లే.

ఇండియన్ ఫాస్ట్ బౌలర్లు చెమటోడ్చుతున్నా వికెట్లు తీయలేకపోతున్నారు. ప్రస్తుతం అక్షర్ మరియు అశ్విన్ లు 3 వికెట్లు తీస్తే, ఉమేష్ యాదవ్ కివీస్ స్కిప్పర్ విలియమ్సన్ వికెట్ తీసుకున్నాడు. పిచ్ కూడా ఇప్పుడిప్పుడే స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. ఈ అవకాశాన్ని కెప్టెన్ రహానే అర్ధం చేసుకుని ఎక్కువ ఓవర్లు అశ్విన్ మరియు అక్షర్ లకే ఇవ్వాలి. మరి ఈ రోజులో ఇంకా 40 ఓవర్లు పైగా మిగిలి ఉండగా మన స్పిన్నర్లు తిప్పేస్తారా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: