టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి వన్డే, టి20 ఫార్మాట్లలో ఆడినప్పటికీ టెస్టు ఫార్మాట్లో ఆడాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. టెస్ట్ ఫార్మాట్ లో ప్రతీ ఆటగాడికి కూడా తమ ప్రతిభను చాటుకునేందుకు కావాల్సినంత సమయం దొరుకుతుంది.. అంతేకాదు మైదానంలో కుదుర్కోవడానికి కూడా సమయం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసి చేయాలని భావిస్తూ ఉంటారు. కాని కొంత మంది ఆటగాళ్లకు మాత్రం టీ20 ఫార్మాట్లలో అవకాశం వచ్చినప్పటికీ టెస్ట్ ఫార్మాట్లో అవకాశం రావడానికి మాత్రం కాస్త సమయం పడుతుంది.




 ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా స్వదేశంలో ఆడుతున్న టెస్టు సిరీస్ లో టెస్ట్ ఫార్మాట్ లోకి అడుగుపెట్టాడు శ్రేయస్ అయ్యర్.. ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున వన్డే టి20 మ్యాచ్ లు ఆడి నిలకడ గల ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు టెస్టు సిరీస్లో కూడా అరంగేట్రం చేసి మొదటి మ్యాచ్ లోనే అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా శ్రేయస్ అయ్యర్ తన మొదటి అరంగేట్రం మ్యాచ్లోనే ఏకంగా శతకం సాధించి అదరగొట్టాడు అని చెప్పాలి.   టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం రెండో ఇన్నింగ్సులో అర్థ శతకం సాధించి ఏకంగా మాజీ క్రికెటర్ల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్.


 అయితే ఇలా తొలి ఇన్నింగ్స్లో శతకం రెండవ ఇన్నింగ్స్ లో అర్థ శతకం సాధించిన మొదటి భారతీయ క్రికెటర్గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన పదవ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన మొదటి ఇన్నింగ్స్ లో 105 పరుగులు చేసి అదరగొట్టాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఆ తర్వాత జరిగిన రెండవ ఇన్నింగ్స్ లో 65 పరుగులు చేసి టీమిండియాకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర వహించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా శ్రేయస్ అయ్యర్ మరోసారి సెంచరీ కొట్టాడు అని అందరూ భావించారు. కాని చివరికి కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతేకాదు తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ మూడోస్థానంలో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: