ఐపీఎల్ 15 వ సీజన్ కు సంబంధించి జనవరిలో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇప్పటికే ఫ్రాంచైజీల దగ్గరున్న ఆటగాళ్లను వేలానికి వదిలేసే ప్రక్రియకు ఈ రోజుతో సమయం ముగిసినది. ఐపీఎల్ లో ఉన్న ఎనిమిది జట్లు తమకు నచ్చిన ఆటగాళ్లను రీటైన్ చేసుకుని మిగిలిన వారందరినీ వేలానికి వదిలేశారు. ఈ ప్రాసెస్ లో ఎందరో సీనియర్ ఆటగాళ్లకు తమ ఫ్రాంచైజీలు మొండిచేయి చూపాయి. కొన్ని సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఆటగాళ్లను సైతం రీటైన్ చేసుకోవడానైకి జట్లు ఆసక్తి చూపకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ రీటెన్షన్ ప్రక్రియలో కొందరు యువ ఆటగాళ్లు మాత్రం ఫ్రాంచైజీల ఆదరణకు నోచుకున్నారు అని చెప్పాలి.

గత ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఒక యువ ఆటగాడు జాక్ పాట్ కొట్టాడు అని చెప్పాలి. అంతర్జాతీయ అనుభవం అంతగా లేని ప్లేయర్ ను రీటైన్ చేసుకుంది అంటే అతడిలో ఉన్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున గత రెండు సంవత్సరాలుగా ఆడుతున్నా రుతురాజ్ గైక్వాడ్ ను జట్టు యాజమాన్యం రీటైన్ చేసుకుని ఐపీఎల్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. వాస్తవంగా చెప్పాలంటే రుతురాజ్ ను వేలానికి వదిలి ఉంటే జట్లు ఇతని కోసం పోటీ పాడేవి. కానీ ఇప్పుడు సి ఎస్ కె ఆ అవకాశం లేకుండా త్రీ వ ఆటగాడిగా రీటైన్ చేసుకుంది.

గత ఐపీఎల్ లో ఆరంజ్ క్యాప్ గెలుచుకుని తన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియచేశాడు. చెన్నై ఇతడిని ఉంచుకోవడం వలన నియమాల ప్రకారం మూడవ ఆటగాడికి ఇచ్చే 8 కోట్ల రూపాయలు దక్కనుంది. ఇప్పుడు రుతురాజ్ పై ప్రశంశల వర్షం కురుస్తోంది. మరి వచ్చే సీజన్ లోనూ ఇదే విదమైన ఆటతీరును కనబరుస్తాడా? లేదా అన్నది చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: