ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్‌లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లిలు బ్యాటింగ్ చార్ట్‌లో అత్యుత్తమ స్థానంలో ఉన్న భారతీయులుగా కొనసాగుతుండగా, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ కూడా బౌలర్లలో రెండవ స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రోహిత్ 5, కోహ్లి 6వ స్థానాల్లో ఉన్నారు. ఇక అశ్విన్ తన రెండవ స్థానాన్ని నిలబెట్టుకోగా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం దిగజారి 10వ ర్యాంక్‌కు చేరుకున్నారు. అయితే అశ్విన్ మినహా ఈ మిగితా ముగ్గురు ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో డ్రాగా ముగిసిన తొలి టెస్టులో పాల్గొనలేదు.

ఇక ఈ కాన్పూర్‌ టెస్ట్ లో అరంగేట్ర ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్ లలో 105 మరియు 65 తో  ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్ గెలుచుకోవడంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 74వ స్థానంలోకి వచ్చాడు. ఇక ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ఆరు స్థానాలు ఎగబాకి 66వ ర్యాంక్‌కి మరియు వృద్ధిమాన్ సాహా తొమ్మిది స్థానాలు ఎగబాకి 99వ ర్యాంక్‌కి వచ్చి చెప్పుకోదగ్గ పురోగతిని సాధించారు. అయితే ఈ ఇద్దరు తొలి టెస్టులో అర్ధ సెంచరీలు సాధించారు. అయితే ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన బౌలర్ రవీంద్ర జడేజా రెండు స్థానాలు ఎగబాకి 19వ ర్యాంక్‌తో పాటు ఆల్‌రౌండర్లలో ఒక స్థానం ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్ ఆల్‌రౌండర్‌ గా మూడో స్థానంలో ఉండగా, బ్యాటర్లలో 79వ స్థానంలో ఉన్నాడు.

ఇక న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్ రెండు ఇన్నింగ్స్ లలో 95 మరియు 52 పరుగులతో అతను తిరిగి టాప్ 10లోకి వచ్చాడు. అతను 14వ స్థానం నుండి బ్యాటింగ్ లో తొమ్మిదవ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్లలో కైల్ జేమీసన్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు, ప్రతి ఇన్నింగ్స్‌లో అతని మూడు వికెట్లు తీసి ఆరు స్థానాలు పైకి వచ్చాడు. ఇక టిమ్ సౌతీ ఈ మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తీయడం ద్వారా రెండవ స్థానంలో ఉన్న అశ్విన్ (840) కంటే ఒక పాయింట్‌ తక్కువగా ఉండి బౌలింగ్ లో 3వ స్థానంలో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: