ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించి ప్రపంచ క్రికెట్ క్రీడాకారులు ఆకర్షించిన ఒక దేశీయ లీగ్. ప్రపంచ క్రికెట్లో అతి పెద్ద దేశీయ లీగ్ గా కొనసాగుతుంది. బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తు అలరిస్తూ అసలుసిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇక టీమిండియాలో స్థానం దక్కించుకోవాలి అనుకున్న ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా మారిపోయింది.



 ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లు టీమిండియా లోకి అరంగేట్రం చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదండోయ్ ఎంతో మంది ఆటగాళ్లను ఏకంగా కోటీశ్వరులుగా కూడా మార్చేస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఏకంగా కొంతమంది యువ ఆటగాళ్లను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇప్పుడు ఇలాంటి జాబితాలో యువ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ కూడా చేరిపోయాడు.. ఇటీవలే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్ అయ్యర్. కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరపున ఆడిన వెంకటేష్ అయ్యర్. తన అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు.


 ఇక ఇటీవల ఏకంగా టీమిండియాలో కూడా అవకాశాన్ని దక్కించుకున్నాడు వెంకటేష్ అయ్యర్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవల ఈ యువ ఆటగాడు కోటీశ్వరుడు అయ్యాడు. 2020 సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 20 లక్షలతో అతని కొనుగోలు చేసింది. ఇప్పుడు మాత్రం ఏకంగా ఎనిమిది వెచ్చించింది. అతని రిటైన్ చేసుకునేందుకు మొగ్గుచూపింది. అతడి సాలరీ ఏకంగా 3900 శాతం పెరగడం విశేషం.. గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో కేవలం చివరి 10 మ్యాచుల్లో మాత్రమే అవకాశాన్ని దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా రాణించి తక్కువ సమయంలోనే టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: